OPPO K13 5G Launch : భారీ బ్యాటరీతో ఒప్పో K13 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 21నే లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలివే!

OPPO K13 5G Launch : ఒప్పో K13 5G ఫోన్ ఈ నెల 21న లాంచ్ కానుంది. 7000mAh భారీ బ్యాటరీతో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ధర ఎంత ఉండొచ్చుంటే?

OPPO K13 5G Launch

OPPO K13 5G Launch : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఒప్పో లేటెస్ట్ ఫోన్ ఒప్పో K13 5G వచ్చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. అధికారిక లాంచ్ తేదీని ఏప్రిల్ 21గా కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఇప్పటికే కొన్ని స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఏప్రిల్‌లో భారత మార్కె్ట్లో లాంచ్ కానున్న లేటెస్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో K13 5G. డిజైన్, కెమెరా క్వాలిటీ, ఇతర స్పెషిఫికేషన్లతో మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

Read Also : Match Fixing in IPL 2025 : ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం? ఆ హైదరాబాదీతో జాగ్రత్త.. ఐపీఎల్ జట్లకు బీసీసీఐ హెచ్చరిక..!

ఒప్పో K13 డిస్‌ప్లే, కలర్ ఆప్షన్లు :
దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ 64 రేటింగ్‌తో ఈ ఒప్పో ఫోన్ 6.66-అంగుళాల పొడవైన డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫుల్ HD+ అమోల్డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది. ఒప్పో ఈ ఫోన్ ఐసీ పర్పుల్, ప్రిజం బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

ఒప్పో K13 5G కెమెరా :
ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ లెన్స్‌ను అందిస్తుంది. డెప్త్ సెన్సింగ్ కోసం 2MP లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీ కెమెరా ఐలాండ్‌లో 16MP లెన్స్ ఉంది. 50MP ప్రైమరీ లెన్స్ ఏఐ సపోర్టుతో వస్తుంది. ఫొటోల క్వాలిటీ, రాత్రిపూట కూడా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.

ఒప్పో K13 5G ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్ :
ఈ ఒప్పో ఫోన్ స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్‌సెట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 (4nm), 6,000mm² గ్రాఫైట్ షీట్‌పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ColorOS 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తుంది. 8GB (LPDDR4X) ర్యామ్, అలాగే 256GB UFS 3.1 స్టోరేజ్‌ను అందిస్తుంది. మల్టీ టాస్కింగ్‌ సరైనది. యాప్‌ల మధ్య మారడం, సోషల్ మీడియాను ఉపయోగించడం, వీడియో కాల్స్, బ్రౌజింగ్ వంటి మరెన్నో టాస్కులను పూర్తి చేయొచ్చు.

ఒప్పో K13 5G బ్యాటరీ :
80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 7,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఒప్పో ఫోన్ ఛార్జ్ చేయకుండా కనీసం రెండు రోజులు పనిచేస్తుంది. ఈ 5జీ ఫోన్ 80W స్పీడ్ రీఛార్జ్‌ అవుతుంది. ఒప్పోలో స్టీమ్ రూం, గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి. భారీ వినియోగం లేదా గేమింగ్ సమయంలో ఫోన్‌ను కూల్‌గా ఉంచడంలో సాయపడుతుంది.

Read Also : NASA Asteroid : నాసా హెచ్చరిక.. భూమివైపు వేగంగా దూసుకొస్తున్న 390 అడుగుల భారీ గ్రహశకలం.. మన గ్రహాన్ని ఢీకొడుతుందా?

భారత్‌లో ఒప్పో K13 5G ధర :
ఈ బేస్ వేరియంట్ రూ. 20వేల ధరకు లభిస్తుంది. ఈ ఒప్పో ఫోన్ ఏప్రిల్ 21న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లాంచ్ అవుతుందని ఒప్పో ధృవీకరించింది.