చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో ఇవాళ భారత్‌లో ఒప్పో కే13 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌తో వచ్చింది. 6.7-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+అమోల్డ్ డిస్‌ప్లేతో దీన్ని విడుదల చేశారు. ఇందులో 7,000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది.
ఒప్పో కే13 స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999గా ఉంది. అలాగే, 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 19,999. ఐసీ పర్పుల్, ప్రిజం బ్లాక్ కలర్ల వేరియంట్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 25 నుంచి ఒప్పో ఈ-స్టోర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవచ్చు. పలు కార్డులపై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ట్రేడ్-ఇన్ ఒప్పందాలపై కంపెనీ రూ.1,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది.
ఒప్పో కే13 ఫీచర్లు
ఒప్పో కే13 స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేటు, 1,200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేతో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్ ద్వారా 8GB RAM వరకు, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లాంచ్ అయింది.
2MP డెప్త్ సెన్సార్‌తో 50MP ప్రైమరీ సెన్సార్‌తో వచ్చింది. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 16MP సోనీ IMX480 సెన్సార్ ఉంది. ఒప్పో కంపెనీ రెండు సంవత్సరాల పాటు ఓఎస్ అప్‌గ్రేడ్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌గ్రేడ్లను కూడా ఇస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000 ఎంఏహెచ్ సామర్థ్యం బ్యాటరీ ఉంది. 80W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు ఉంది. IP65 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. రూ.20 వేలలోపు ధరలో స్మార్ట్‌ఫోన్లను కొనుక్కోవాలనుకుంటున్న వారికి ఒప్పో కే13 స్మార్ట్‌ఫోన్ మంచి ఆప్షన్.