ఒప్పో స్మార్ట్‌ఫోన్లంటే మీకు ఇష్టమా? తక్కువ ధరలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ 2 ఫోన్లు అదుర్స్ అంతే..

ఒప్పో నుంచి వచ్చిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి.

ఒప్పో స్మార్ట్‌ఫోన్లంటే మీకు ఇష్టమా? తక్కువ ధరలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ 2 ఫోన్లు అదుర్స్ అంతే..

Updated On : May 31, 2025 / 8:25 AM IST

Oppo K13 Vs A5 Pro 5G: ఒప్పో స్మార్ట్‌ఫోన్లంటే మీకు ఇష్టమా? ఈ బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఏది కొనాలో అర్థం కావడం లేదా? అయితే, ఈ బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడైన రెండు స్మార్ట్‌ఫోన్‌ల గురించి మీరు తెలుసుకోవాల్సిందే. Oppo K13 5G, Oppo A5 Pro స్మార్ట్‌ఫోన్లకు మంచి క్రేజ్ ఉంది. ఈ రెండు ఫోన్ల ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఈ రెండు ఫోన్ల ధరలు
Oppo K13 5G ఫోన్ ధర రూ.16,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పలు వేరియంట్లలో వచ్చింది. వాటి ధరలు వేర్వేరుగా ఉంటాయి.

A5 Pro ఫోన్ రూ.17,999కు అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్‌లను ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాంల ద్వారా కొంటే డిస్కౌంట్లు కూడా పొందొచ్చు.

Oppo K13 5G ఫీచర్లు
Oppo K13 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల AMOLED ఫ్లాట్ డిస్‌ప్లేతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులో ఉంది. మీ చేతులు తడిగా ఉన్న సమయంలోనూ దీన్ని స్క్రోల్ చేయవచ్చు. ఫొటోగ్రఫీ కోసం డ్యూయల్ కెమెరా సెటప్‌తో అందుబాటులో ఉంది. దీని ప్రైమరీ కెమెరా 50MP.

సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా ఉంది. డిస్‌ప్లే కింది భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 7000 mAh బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ వచ్చింది. 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది.

Oppo A5 Pro ఫీచర్లు
Oppo A5 Pro 6.67-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 720×1,604 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వచ్చింది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. 1,000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. 45W SuperVOOC ఛార్జింగ్‌తో 5,800mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి.

ఒప్పో నుంచి వచ్చిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. అయితే, ఒప్పో A5 Pro ఒప్పో కంటే K13 చాలా మందికి నచ్చుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.