Oppo K14 Plus Launch : దిమ్మతిరిగే ఫీచర్లతో ఒప్పో K14 ప్లస్ వచ్చేసింది.. ధర మీ బడ్జెట్‌లోనే.. ఫస్ట్ సేల్ డేట్ ఇదే!
Oppo K14 Plus Launch : ఒప్పో కె14 ప్లస్ ఫోన్ వచ్చేసింది. రూ. 30వేల లోపు ధరలో ఈ ఒప్పో ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఫస్ట్ సేల్ డేట్ ఎప్పుడో తెలుసా?
- Sreehari A
- Published on- September 29, 2026 / 02:44 PM IST
Oppo K14 Plus Launch
- 8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్, 4K వీడియో రికార్డింగ్
- 8,000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్
- 5,000mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్
- ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇ-స్టోర్‌లో రూ. 4వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్
Oppo K14 Plus Launch : ఒప్పో నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో ఒప్పో K14 ప్లస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. రూ. 30వేల లోపు ధరలో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మ్యాక్స్ చిప్‌సెట్, 1.5K 144Hz అమోలెడ్ డిస్‌ప్లే, 6 ఏళ్ల వరకు లైఫ్ అందించే 8,000mAh బ్యాటరీ, 4K వీడియోతో 50MP OIS మెయిన్ కెమెరా, 5000mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలు కానుంది. ఈ ఒప్పో కె14 ప్లస్ ఫోన్ సోలార్ ఆరెంజ్, స్టార్ వైట్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఇ-స్టోర్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు.
ఒప్పో K14 ప్లస్ స్పెసిఫికేషన్లు :
ఒప్పో K14 ప్లస్ ఫోన్ 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 144Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఈ ఒప్పో ఫోన్ 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మ్యాక్స్ చిప్‌సెట్‌తో పాటు ఆర్మ్ మాలి-G615 జీపీయూ అమర్చారు.
8GB వరకు LPDDR4X ర్యామ్, 256GB వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఒప్పో ఫోన్ 8,000mAh బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ట్రినిటీ ఇంజిన్, ఏఐ లింక్‌బూస్ట్ 4.0, ఏఐ కాల్ గార్డ్, ఎక్స్‌టెండెడ్ యూజర్ కేర్ 2.0తో కలర్‌ఓఎస్ 16పై రన్ అవుతుంది.
కెమెరాల విషయానికొస్తే..
ఈ కంపెనీ 4K వీడియో రికార్డింగ్‌తో 50MP OIS మెయిన్ కెమెరా (1/2-అంగుళాల సెన్సార్, ఎఫ్/1.8), 16MP సోనీ IMX480 ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఈ ఒప్పో ఫోన్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం, ఐరన్ ఫ్రేమ్‌తో 360° ఆర్మర్ బాడీని అందిస్తుంది. దీనికి IP69K, IP69, IP68, IP66 రేటింగ్ ఉన్నాయి.
భారత్‌లో ఒప్పో K14 ప్లస్ ధర :
ఒప్పో K14 ప్లస్ బేస్ 6GB + 128GB వేరియంట్ ధర రూ. 29,999 కాగా, 8GB + 128GB వేరియంట్ ధర రూ. 32,999, టాప్ 8GB + 256GB వేరియంట్ ధర రూ. 35,999గా ఉంది. రూ. 4వేలు బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు. ఒప్పో K14 ప్లస్ ఫోన్ అక్టోబర్ 8, 2026 అర్ధరాత్రి 12:00 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఇ-స్టోర్‌లో అమ్మకానికి వస్తుంది.
