Oppo K15 Series Launch : ఒప్పో నుంచి కొత్త బడ్జెట్ 5G ఫోన్లు.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే, ధర జస్ట్ ఎంతంటే?

Oppo K15 Series Launch : ఒప్పో K15x చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో 6500mAh బ్యాటరీ, 45W సూపర్ వూక్ ఛార్జింగ్, 120Hz డిస్‌ప్లే ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. పూర్తి ధర, ఫీచర్లు ఇవే..

Oppo K15 Series

  • ఒప్పో K15x ఫోన్ భారీ 6500mAh బ్యాటరీ
  • 120Hz డిస్‌ప్లే, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
  • 45W సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది

Oppo K15 Series Launch : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? ఒప్పో కె-సిరీస్‌లో కొత్త ఒప్పో K15 స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయ్.. కంపెనీ ఒప్పో K15sతో పాటు ఒప్పో K15x కూడా లాంచ్ చేసింది.
ఈ ఫోన్‌లో భారీ 6500mAh బ్యాటరీ, 45W సూపర్ వూక్ ఛార్జింగ్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ డిస్‌ప్లే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్, కంపెనీ డైమండ్ యాంటీ-డ్రాప్ ఆర్కిటెక్చర్‌తో వస్తుంది.

ఒప్పో K15x చైనాలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 6GB + 128GB కాన్ఫిగరేషన్ ధర 1,399 యువాన్లు (సుమారు రూ. 20వేలు) కాగా, 6GB + 256GB వేరియంట్ ధర 1,699 యువాన్లు (సుమారు రూ. 24,400)కు పొందవచ్చు. ఈ ఫోన్ గ్లేసియర్ వైట్, ప్రిజం పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్ లభ్యతపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read Also : WhatsApp Parental Controls : పిల్లల వాట్సప్‌కు కొత్త రూల్స్.. ఏ గ్రూప్‌లో చేరాలో పేరెంట్సే డిసైడ్!

ఒప్పో K15x ఫోన్ 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,125 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్‌ప్లే 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌ కూడా అందిస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు LPDDR4X ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ IP64 రేటింగ్ డైమండ్ యాంటీ-డ్రాప్ ఆర్కిటెక్చర్‌తో వస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. :
కొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లో 13MP ఆటోఫోకస్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరా 10x వరకు డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే.. రియర్ కెమెరా 60fps వరకు 1080p వీడియోను రికార్డ్ చేయగలదు. అదే సమయంలో 120fps వరకు 720p స్లో-మోషన్ వీడియో రికార్డింగ్ కూడా అందిస్తుంది.

ఒప్పో కె15x ఫోన్ 6500mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 45W సూపర్ వూక్ (SuperVOOC) యూఎఫ్‌సీఎస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే, కంపెనీ ప్రకారం రేటెడ్ బ్యాటరీ సామర్థ్యం 6,335mAh అందిస్తుంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ డ్యూయల్-సిమ్, వై-ఫై 5, బ్లూటూత్ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది. ఒప్పో కె15ఎక్స్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఇందులో NFC సపోర్ట్ లేదు.