Oppo F29 Series Launch : పవర్‌ఫుల్ బ్యాటరీతో కొత్త ఒప్పో వాటర్‌ప్రూఫ్ 5G ఫోన్‌ వచ్చేసిందోచ్.. ఏఐ ఫీచర్లు అదుర్స్. ధర ఎంతంటే?

Oppo F29 Series Launch : ఒప్పో ఇండియా భారతీయ వినియోగదారుల కోసం ఒప్పో F29, ఒప్పో F29 ప్రోలను లాంచ్ చేసింది. ఈ మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు పవర్‌ఫుల్ బ్యాటరీలు, ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి.

Oppo F29 Series Launch

Oppo F29 Series Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఒప్పో నుంచి సరికొత్త F29 సిరీస్‌ వచ్చేసింది. ఒప్పో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో ఒప్పో F29, ఒప్పో F29 Pro ఫోన్లను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్లు ఏఐ లింక్‌బూస్ట్ టెక్నాలజీ, హంటర్ యాంటెన్నా ఆర్కిటెక్చర్ ద్వారా అడ్వాన్స్‌డ్ సిగ్నల్ బూస్టర్ ఫీచర్‌లను కలిగి ఉన్నాయి.

అంతేకాదు.. 360-డిగ్రీల ఆర్మర్ బాడీతో వచ్చాయి. మిలిటరీ-గ్రేడ్ MIL-STD-810H-2022 సర్టిఫికేషన్‌ పొందాయి. కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా ఫోన్లను ఒప్పో రూపొందించింది. అదనంగా, IP66, IP68, IP69 రేటింగ్‌లతో ఈ స్మార్ట్‌ఫోన్‌లు దుమ్ము, నీటి నిరోధకతను అందిస్తాయి. ఒప్పో F29, ఒప్పో F29 Pro ఫోన్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Pixel 9a vs iPhone 16e : పిక్సెల్ 9a ఫోన్ కొనాలా? ఐఫోన్ 16e కొనాలా? ఇందులో ఏది కొంటే బెటర్? ఫీచర్లు, ధర ఎంతంటే?

ఒప్పో F29 ప్రో, F29 భారత్ ధర, లభ్యత :
ఒప్పో F29 5G ఫోన్ 8GB + 128GB మోడల్ రూ. 23,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB + 256GB వెర్షన్ ధర రూ. 25వేలు, ప్రస్తుతం ఒప్పో ఇండియా ఇ-స్టోర్‌లో ప్రీ-ఆర్డర్‌లు ఓపెన్ అయ్యాయి. డెలివరీలు మార్చి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు గ్లేసియర్ బ్లూ, సాలిడ్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు.

మరోవైపు, ఒప్పో F29 ప్రో 5G ఫోన్ 8GB + 128GB కాన్ఫిగరేషన్ రూ.27,999 నుంచి ప్రారంభమవుతుంది. 256GB ఆప్షన్లు 8GB వేరియంట్ రూ.29,999, 12GB వేరియంట్ రూ.31,999 ధరకు లభిస్తాయి. ఈ మోడల్ కోసం ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి షిప్పింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గ్రానైట్ బ్లాక్, మార్బుల్ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.

ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లేదా ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే కస్టమర్లు 10 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదనంగా 10 శాతం ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది.

కొనుగోలుదారులు 8 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ స్కీమ్‌లను లేదా 6 నెలల వరకు ఎక్స్‌టెండెడ్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. రెండు మోడళ్లు అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

ఒప్పో F29 ప్రో, F29 స్పెసిఫికేషన్లు :
ఒప్పో F29 5G, ఒప్పో F29 ప్రో 5G ఫోన్లు 6.7-అంగుళాల Full-HD+ (1,080 x 2,412 పిక్సెల్స్) అమోల్డ్ డిస్‌ప్లేలను 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ కలిగి ఉన్నాయి. ఇవన్నీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తాయి. స్టాండర్డ్ F29 వేరియంట్ అదనపు మన్నికకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iతో వస్తుంది.

ఒప్పో F29 5G బేస్ మోడల్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. అయితే, ఒప్పో F29 ప్రో మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎనర్జీ SoCని కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 12GB వరకు LPDDR4X ర్యామ్, 256GB వరకు UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తాయి. ColorOS 15.0తో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతాయి.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. రెండు మోడళ్లలో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్, 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. ప్రో వేరియంట్ ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ను అందిస్తుంది.

అయితే, స్టాండర్డ్ వెర్షన్‌లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) ఉంటుంది. ముఖ్యంగా, రెండు ఫోన్‌లు 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తాయి. నీటి అడుగున కూడా ఫొటోలు తీసేందుకు ఫోటోగ్రఫీ మోడ్‌తో వస్తాయి.

Read Also : Google Pixel 8a Price : గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫీచర్ల కోసమేనా కొనేసుకోవచ్చు.. ఇంకా చౌకైన ధరకు ఎలా పొందాలంటే?

ఒప్పో F29 5G సిరీస్ డస్ట్, వాటర్ నిరోధకతకు IP66, IP68, IP69 ప్రమాణాలను కలిగి ఉంది. మిలిటరీ-గ్రేడ్ MIL-STD-810H-2022 డ్రాప్ రెసిస్టెన్స్‌తో పాటు 360-డిగ్రీల ఆర్మర్ బాడీతో రూపొందింది. మెరుగైన సిగ్నల్ స్ట్రెంగ్త్ కోసం AI లింక్‌బూస్ట్ టెక్నాలజీ, హంటర్ యాంటెన్నా ఆర్కిటెక్చర్‌ను ఉపయోగిస్తారు.

ఒప్పో F29 5G ఫోన్ 6,500mAh బ్యాటరీతో వస్తుంది. 45W సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అయితే, ఒప్పో F29 ప్రో ఫోన్ 80W SuperVOOC ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. రెండు ఫోన్లు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను అందిస్తాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, Wi-Fi 6, బ్లూటూత్, OTG, GPS, USB టైప్-C ఉన్నాయి.