Pixel 9a vs iPhone 16e : పిక్సెల్ 9a ఫోన్ కొనాలా? ఐఫోన్ 16e కొనాలా? ఇందులో ఏది కొంటే బెటర్? ఫీచర్లు, ధర ఎంతంటే?

Pixel 9a vs iPhone 16e : భారత మార్కెట్లో ఐఫోన్ 16e పోటీగా గూగుల్ పిక్సెల్ 9a వచ్చేసింది. ఐఫోన్ 16e ఫీచర్ల మాదిరిగానే పిక్సెల్ 9a కూడా అంతే స్థాయిలో ఫీచర్లను కలిగి ఉంది. అయితే, ఈ రెండింటిలో ఏది బెటర్ డీల్ అనేది ఇప్పుడు చూద్దాం..

Pixel 9a vs iPhone 16e : పిక్సెల్ 9a ఫోన్ కొనాలా? ఐఫోన్ 16e కొనాలా? ఇందులో ఏది కొంటే బెటర్? ఫీచర్లు, ధర ఎంతంటే?

Pixel 9a vs iPhone 16e

Updated On : March 20, 2025 / 12:55 PM IST

Pixel 9a vs iPhone 16e : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ లాంచ్ అయింది. అంతకంటే ముందుగానే ఆపిల్ కొత్త ఐఫోన్ 16e కూడా అందుబాటులో ఉంది. అయితే, గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌లో ఐదవ మోడల్.

మిగిలిన సిరీస్‌ల మాదిరిగా కాకుండా ‘a’ వేరియంట్ సరసమైన ప్యాకేజీలో హై-ఎండ్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఆకర్షణీయమైన కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. గూగుల్ కస్టమ్-బిల్ట్ టెన్సర్ G4 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. పిక్సెల్ 9 సిరీస్‌లో పిక్సెల్ 9a అత్యల్ప ధరకు పొందవచ్చు.

Read Also : Smart TVs Discount : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? ఐపీఎల్‌కు ముందు స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.6,999 మాత్రమే..!

ఇతరుల ఫోన్ల మాదిరిగానే అదే ప్రాసెసర్‌ను కలిగి ఉండటం గమనార్హం. గత ఫిబ్రవరి 28, 2025న లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ 16e మోడల్‌కు పిక్సెల్ 9a ఫోన్ గట్టి పోటీనిస్తోంది. ఐఫోన్ 16e ధర రూ. 59,900 నుంచి అందుబాటులో ఉంది.

ఐఫోన్ 16e ధర పిక్సెల్ 9a కన్నా రూ. 10వేలు ఎక్కువగా ఉంది. పిక్సెల్ 9a ఆండ్రాయిడ్‌లో రన్ అవుతుంది. ఐఫోన్ 16e iOS కలిగి ఉంది. అయితే, ఈ రెండు ఫోన్లలో ఏది కొంటే బెటర్? ఫీచర్లు, ధర పూర్తి వివరాలను ఓసారి కంపేర్ చేసి తెలుసుకుందాం.

పిక్సెల్ 9a vs ఐఫోన్ 16e భారత్ ధర ఎంతంటే? :
ఈ రెండు ఫోన్లను కంపేర్ చేస్తే.. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 256GB సింగిల్ వేరియంట్‌లో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 49,999కు అందిస్తోంది. ఐఫోన్ 16e మొత్తం 3 కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. 128GB ధర రూ. 59,900, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 69,900, 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 89,900కు అందిస్తోంది. ఆపిల్ బడ్జెట్ ఐఫోన్ గూగుల్ Pixel 9a కన్నా ధర ఎక్కువ.

పిక్సెల్ 9a vs ఐఫోన్ 16e ప్రాసెసర్ :
హుడ్ కింద, గూగుల్ పిక్సెల్ 9a లేటెస్ట్ టెన్సర్ G4 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. మెరుగైన సెక్యూరిటీ కోసం టైటాన్ M2 సెక్యూరిటీ కో-ప్రాసెసర్‌తో వస్తుంది. పిక్సెల్ 9 సిరీస్ ఫ్లాగ్‌షిప్ వేరియంట్‌లలో అదే ప్రాసెసర్ కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే.. పిక్సెల్ 9a లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

జెమిని ఏఐ, పాపులర్ గూగుల్ అసిస్టెంట్‌తో సహా గూగుల్ AI-ఆధారిత ఫీచర్లతో నిండి ఉంది. మరోవైపు, ఐఫోన్ 16eలో 6-కోర్ CPU, 4-కోర్ GPUతో A18 చిప్ ఉంది. ఈ ఫోన్ మెషిన్ లెర్నింగ్ కోసం 16-కోర్ న్యూరల్ ఇంజిన్ కూడా ఉంది.

ఆపిల్ ప్రకారం.. న్యూరల్ ఇంజిన్ A13 కన్నా 6 రెట్లు వేగంగా ఏఐ మోడళ్లను ప్రాసెస్ చేయగలదు. ఐఫోన్ 16e ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఇందులో జెన్మోజీ, రైటింగ్ టూల్స్, చాట్‌జీపీటీతో ఇంటిగ్రేషన్ వంటి టూల్స్ ఉన్నాయి.

పిక్సెల్ 9a vs ఐఫోన్ 16e బ్యాటరీ, ఛార్జింగ్ :
ఆపిల్ బ్యాటరీ సైజును రివీల్ చేయలేదు. ఐఫోన్ 16e అన్ని 6.1-అంగుళాల ఐఫోన్‌ల కన్నా భారీ బ్యాటరీని కలిగి ఉందని ఆపిల్ పేర్కొంది. ఐఫోన్ 16e ఐఫోన్ 16 కన్నా పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఆపిల్ C1 మోడెమ్ అత్యంత ప్రముఖ ఫీచర్లలో ఒకటి.

వాస్తవానికి ఐఫోన్ 16 కన్నా ఐఫోన్ 16e ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఐఫోన్ 16e అడాప్టర్‌తో 20W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. గూగుల్ కూడా ఛార్జర్ లేకుండానే ఫోన్ అందిస్తోంది. కానీ, 5,100mAh బ్యాటరీ 23W వైర్డు, 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్ స్పీడ్ సపోర్టు ఇస్తుంది.

పిక్సెల్ 9a vs ఐఫోన్ 16e కెమెరా ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9ఎ, ఐఫోన్ 16ఇ రెండూ అడ్వాన్స్‌డ్ కెమెరా సిస్టమ్ కలిగి ఉన్నాయి. పిక్సెల్ 9ఎ ఏఐ ఆధారిత కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ, మల్టీఫేస్ ఆప్షన్లు కలిగి ఉంది. ఐఫోన్ 16e ఆప్టికల్ జూమ్, వీడియో రికార్డింగ్ కలిగి ఉంది. పిక్సెల్ 9aలో 48MP మెయిన్ సెన్సార్ ఉంది.

గూగుల్ అడ్వాన్స్‌డ్ ఏఐ ప్రాసెసింగ్‌ను కలిగి ఉంది. 13MP అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉంది. అదనంగా, పిక్సెల్ 9a మాక్రో ఫోకస్‌కు సపోర్టు ఇస్తుంది. గూగుల్ Add Me, Best Take, Magic Editor, Magic Eraser వంటి అనేక AI-ఆధారిత టూల్స్ కూడా ఇంటిగ్రేట్ అయ్యాయి. వినియోగదారులు ఫోటోలను సులభంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 16e మోడల్ 48MP ఫ్యూజన్ కెమెరాతో అమర్చి ఉంది. వైడ్-యాంగిల్, టెలిఫోటో సెన్సార్‌తో వస్తుంది. పిక్సెల్ 9a మాదిరి అల్ట్రావైడ్ లెన్స్ లేదు. 12MP 2x టెలిఫోటో జూమ్‌తో వస్తుంది. డిజిటల్ జూమ్‌ లేకుండానే హై క్వాలిటీ క్లోజప్‌లను అందిస్తుంది.

Read Also : Google Pixel 9a : కొత్త ఫోన్ భలే ఉందిగా.. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ ఆగయా.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

ఫోటోనిక్ ఇంజిన్ ఇమేజ్ ప్రాసెసింగ్‌ను అందిస్తుంది. తక్కువ-కాంతిలో పర్ఫార్మెన్స్, కలర్ క్వాలిటీని కలిగి ఉంది. ఆపిల్ కెమెరా సిస్టమ్ వీడియో రికార్డింగ్‌లో 4K డాల్బీ విజన్‌కు సపోర్టు ఇస్తుంది. ప్రొఫెషనల్-గ్రేడ్ వీడియో క్వాలిటీని అందిస్తుంది.

పిక్సెల్ 9a vs ఐఫోన్ 16e : డిస్‌ప్లే, డిజైన్ వివరాలు :
ఆపిల్ ఐఫోన్ 16e మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆపిల్ హై రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉండగా గూగుల్ పిక్సెల్ 9aని 6.3-అంగుళాల యాక్టువా pOLED డిస్‌ప్లేతో అమర్చింది.

120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డిజైన్ పరంగా, పిక్సెల్ 9a అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఐఫోన్ 16e అంతే స్థాయిలో ఫీచర్లను కలిగి ఉంది. వైడ్ నాచ్ సింగిల్ బ్యాక్ కెమెరాతో పాత ఐఫోన్ 14 పోలి ఉంటుంది.