Smart TVs Discount : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? ఐపీఎల్‌కు ముందు స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.6,999 మాత్రమే..!
Smart TVs Discount : కొత్త స్మా్ర్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? ఐపీఎల్‌కు ముందు అమెజాన్ కొన్ని స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌టీవీని అతి తక్కువ ధరకే కొనేసుకోండి.

Smart TVs Discount
Smart TVs Discount : కొత్త స్మార్ట్‌టీవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అతి త్వరలో ఐపీఎల్ వచ్చేస్తోంది. ఐపీఎల్ సీజన్ (IPL 2025) 18వ సీజన్ మార్చి 22న ప్రారంభమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ లీగ్ క్రికెట్ మెగా ఈవెంట్‌ను ఇంట్లోనే కూర్చొని హాయిగా చూడవచ్చు. ఐపీఎల్ మ్యాచ్‌లను హైక్వాలిటీతో చూడాలనుకుంటే మంచి స్మార్ట్‌టీవీ ఉండాల్సిందే. అందుకే మీకోసం అతి తక్కువ ధరలో స్మార్ట్‌టీవీలు అందుబాటులో ఉన్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లోని ప్రతి మ్యాచ్ మీ ఇంటి నుంచి బిగ్ స్ర్కీన్‌లో ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం, అమెజాన్ స్మార్ట్ టీవీలపై అద్భుతమైన సేల్‌ను ఆఫర్ చేస్తోంది. కేవలం రూ. 6,999 ధరకే ఆఫర్ చేస్తోంది.
మీ లివింగ్ రూమ్‌ను స్టేడియం వాతావరణంగా మార్చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ (EPL) సేల్ మార్చి 21 నుంచి మార్చి 26 వరకు అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌టీవీలతో సహా అనేక రకాల ఎలక్ట్రానిక్‌లపై బెస్ట్ డీల్స్ అందిస్తోంది.
రెడ్‌మి F సిరీస్ :
రెడ్‌మి లేటెస్ట్ F సిరీస్ స్మార్ట్ LED TVపై 40 శాతం అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆకట్టుకునే 43-అంగుళాల స్క్రీన్, స్టీరియో స్పీకర్లతో ఈ పెద్ద-స్క్రీన్ స్మార్ట్ టీవీ అద్భుతమైన 4K క్వాలిటీని అందిస్తుంది. దాంతో హై క్వాలిటీ కంటెంట్‌ను వీక్షించవచ్చు. ఈ స్మార్ట్‌టీవీ అసలు ధర రూ. 42,999 ఉండగా, మీరు సేల్ సమయంలో కేవలం రూ. 25,999 సొంతం చేసుకోవచ్చు.
Skywall స్మార్ట్ టీవీ :
అతి తక్కువ ధరలో స్మార్ట్‌టీవీ కోసం చూసేవారికి స్కైవాల్ స్మార్ట్ HD టీవీ బెస్ట్ ఆప్షన్. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుపై 68 శాతం తగ్గింపుతో లభిస్తుంది. రూ. 22,499 ధరకు లభించే ఈ స్కైవాల్ స్మార్ట్ HD టీవీని ఇప్పుడు మీరు కేవలం రూ. 7,299కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు.. బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ 32-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది.
Kodak స్మార్ట్ టీవీ :
కోడాక్ ఎల్ఈడీ స్మార్ట్ టీవీని అసలు ధరలో సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇదో అద్భుతమైన డీల్. అసలు ధర రూ. 15,999 ఉండగా, అమెజాన్‌లో కేవలం రూ. 8,499కే లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లతో సహా వివిధ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Mi స్మార్ట్ టీవీ :
షావోమీ స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ.24,999 ధరకు లభ్యమవుతోంది. కానీ, తగ్గింపు ధర రూ.13,499కు కొనుగోలు చేయొచ్చు. ఈ మోడల్ 32-అంగుళాల HD-రెడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. వ్యూ పరంగా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఐపీఎల్ చూసేవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
VW స్మార్ట్ టీవీ :
VW స్మార్ట్ టీవీ అత్యంత సరసమైన ఫ్రేమ్‌లెస్ ఆప్షన్. HD క్వాలిటీ వీడియోను అందించే 32-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. అసలు ధర రూ. 16,999 ఉండగా, కేవలం రూ. 7,299కి లభ్యమవుతుంది. మీరు కొనుగోలు చేసినప్పుడు రూ. 300 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.