BSNL Offer : వావ్.. BSNL కొత్త ప్లాన్ అదుర్స్.. ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. 80 రోజులు ఫ్రీ కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు!

BSNL Offer : బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్.. సరసమైన ధరలో 80 రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు. హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్ బెనిఫిట్స్ పొందవచ్చు. దేశంలో ఎక్కడికైనా ఉచితంగా కాల్స్ చేయొచ్చు.

BSNL Offer : వావ్.. BSNL కొత్త ప్లాన్ అదుర్స్.. ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. 80 రోజులు ఫ్రీ కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు!

BSNL Cheapest Plan

Updated On : March 20, 2025 / 11:06 AM IST

BSNL Offer : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. సరసమైన కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ 80 రోజుల వ్యాలిడిటీతో ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తక్కువ ధరలో అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తోంది.

Read Also : SSY : సుకన్య అకౌంట్ ఎంత మంది పేర్లతో ఓపెన్ చేయొచ్చు? ఏడాదికి రూ. లక్ష పెట్టుబడి పెడితే.. 21 ఏళ్లలో ఎంత డబ్బు చేతికి వస్తుందో తెలుసా?

ఇతర టెలికం దిగ్గజాలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాకు పోటీగా బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. కేవలం రూ.485తో వినియోగదారులు భారత్ అంతటా అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ 80 రోజులు ముగిసిన తర్వాత కూడా వినియోగదారులు ఇతర ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే.. ఎక్కువ కాలం పాటు ఇన్‌కమింగ్ కాల్స్ పొందవచ్చు.

బీఎస్ఎన్ఎల్ 80 రోజుల ప్లాన్ :
ఈ కొత్త 80 రోజుల రీఛార్జ్ ప్లాన్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఈ ప్లాన్ కోసం యూజర్లు రోజుకు దాదాపు రూ. 6 ఖర్చు చేయాలి. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు బీఎస్ఎన్ఎల్ ఫ్రీ నేషనల్ రోమింగ్‌ కూడా అందిస్తోంది. మీరు భారత్‌లో ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు కాల్స్ చేసినా మీకు అదనపు ఛార్జీ పడదు.

వినియోగదారులు ఈ ప్లాన్ వ్యవధిలో మొత్తం 160GB డేటాను పొందవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఫ్రీ టెక్స్ట్ మెసేజ్‌లు కూడా పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ (BiTV)కి కూడా యాక్సెస్‌ను అందిస్తుంది. వినియోగదారులు 400 కన్నా ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను చూడవచ్చు. వివిధ స్ట్రీమింగ్ యాప్‌లను ఉచితంగా యాక్సస్ చేయొచ్చు.

బీఎస్ఎన్ఎల్ రూ.599 ధరతో మరో రీఛార్జ్ ప్లాన్‌ కూడా ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 3GB హై-స్పీడ్ డేటా, ఫ్రీ నేషనల్ రోమింగ్, రోజుకు 100 ఫ్రీ మెసేజ్ కోటా ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్‌తో ప్రత్యేక హోలీ ప్రమోషన్‌ను కూడా అందిస్తోంది.

Read Also : LIC Bima Sakhi : గుడ్ న్యూస్.. మహిళల కోసం LIC అద్భుతమైన స్కీమ్.. టెన్త్ పాసైతే చాలు.. పైసా కట్టకుండా నెలకు రూ.7వేలు సంపాదించుకోవచ్చు!

కస్టమర్ల కోసం 425 రోజుల వ్యాలిడిటీ, రోజువారీ 2GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా అందిస్తుంది. సాధారణ రీఛార్జ్ ప్లాన్ వ్యవధికి అదనంగా 30 రోజులు అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ 4G సర్వీసును ఇప్పుడు 75వేలకు పైగా ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. కస్టమర్లను నిలుపుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఎస్ఎన్ఎల్ తమ యూజర్లను ఇతర నెట్‌వర్క్‌లకు మారకుండా ఉండేందుకు ఆకర్షణీయమైన ప్లాన్లను అందిస్తోంది.