SSY : సుకన్య అకౌంట్ ఎంత మంది పేర్లతో ఓపెన్ చేయొచ్చు? ఏడాదికి రూ. లక్ష పెట్టుబడి పెడితే.. 21 ఏళ్లలో ఎంత డబ్బు చేతికి వస్తుందో తెలుసా?

Sukanya Samriddhi Scheme : ప్రభుత్వ పథకాల కన్నా SSYలో ఇచ్చే వడ్డీ ఎక్కువ. మీ కుమార్తె భవిష్యత్తు కోసం భారీ మొత్తంలో డబ్బు ఆదా చేయవచ్చు. మీరు ఏడాదికి రూ. లక్ష డిపాజిట్ చేస్తే.. ఎంత రాబడి మీ చేతికి వస్తుందంటే?

SSY : సుకన్య అకౌంట్ ఎంత మంది పేర్లతో ఓపెన్ చేయొచ్చు? ఏడాదికి రూ. లక్ష పెట్టుబడి పెడితే.. 21 ఏళ్లలో ఎంత డబ్బు చేతికి వస్తుందో తెలుసా?

Sukanya Samriddhi Scheme

Updated On : March 19, 2025 / 1:54 AM IST

Sukanya Samriddhi Scheme : మీ కుమార్తెల భవిష్యత్తు కోసం ఏ ప్రభుత్వ పథకంలోనైనా పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ప్రభుత్వ పథకం ఒకటి ఉంది. అదే.. సుకన్య సమృద్ధి యోజన పథకం.. ఈ పథకం కింద ఆడపిల్లలకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. కుమార్తెల భవిష్యత్తు సురక్షితంగా ఉంచేందుకు ప్రభుత్వం ఈ సుకన్య సమృద్ధి యోజన (SSY) అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read Also : Realme Narzo 70 Turbo 5G : వావ్.. బంపర్ ఆఫర్.. ఈ రియల్‌మి 5జీ ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరలో మళ్లీ రాదు..!

ఈ పథకంలో, 10 ఏళ్ల వయస్సు వరకు కుమార్తె పేరు మీద పెట్టుబడి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాలి. 21 ఏళ్లలో ఈ పెట్టుబడి మెచ్యూరిటీ చెందుతుంది. SSYలో కుమార్తె తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంవత్సరానికి కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రస్తుతం, ఈ పథకంపై 8.2శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇతర ప్రభుత్వ పథకాలతో పోలిస్తే.. ఈ పథకం చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. కాంపౌండింగ్ ప్రయోజనంతో ఈ పథకం ద్వారా కుమార్తె భవిష్యత్తు కోసం భారీ మొత్తంలో డబ్బు ఆదా చేయవచ్చు.

మీ కుమార్తె పేరుతో ఈ అకౌంట్ తెరిచి ఏడాదికి రూ. లక్ష పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ తర్వాత మీకు ఎంత డబ్బు చేతికి అందుతుంది? ఎంత మంది కుమార్తెల పేరుతో SSY అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రూ. లక్ష వార్షిక పెట్టుబడిపై రాబడి ఎంతంటే? :
మీరు మీ కుమార్తె పేరు మీద ప్రతి ఏడాదిలో రూ. లక్ష పెట్టుబడి పెడితే.. మీరు 15 ఏళ్లలో మొత్తం రూ. 15లక్షలు జమ చేస్తారు. ఈ మొత్తంపై మీకు వడ్డీగా రూ. 31,18,385 లభిస్తుంది. మీరు 21 ఏళ్లలో మెచ్యూరిటీ మొత్తంగా రూ. 46,18,385 పొందవచ్చు. ఈ విధంగా మీరు మీ కుమార్తె కోసం మొత్తాన్ని డబ్బును ఆదా చేయవచ్చు. మీరు ఈ ఏడాది అంటే.. 2025 లో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. ఈ పథకం 2046లో మెచ్యూరిటీ చెందుతుంది.

ఇద్దరు కూతుళ్లకు మాత్రమే అనుమతి :
సుకన్య సమృద్ధి అకౌంట్ ఇద్దరు కుమార్తెల పేరుతో మాత్రమే ఓపెన్ చేయాలనే విషయం చాలా మందికి తెలియదు. మీకు ఇద్దరు కన్నా ఎక్కువ మంది కుమార్తెలు ఉంటే.. మూడో లేదా నాల్గవ కుమార్తెకు ఈ పథకం ప్రయోజనం లభించదు. అయితే, మీకు రెండో కుమార్తె, కవలలు లేదా ముగ్గురు పిల్లలు ఉంటే.. వారికోసం సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

ఇలా అకౌంట్ ఓపెన్ చేయండి :
బ్యాంక్ లేదా పోస్టాఫీసు వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. సుకన్య సమృద్ధి యోజన ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రింటవుట్ తీసుకొని అందులో మీ వివరాలను నింపండి. అవసరమైన సమాచారం, ఫొటోగ్రాఫ్, మీ కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, పాస్‌‌ఫొటో, సంరక్షకుడి గుర్తింపు కార్డు వంటి ఇతర డాక్యుమెంట్లను జత చేయండి.

Read Also : TCL Smart TVs : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? ఈ TCL స్మార్ట్‌టీవీలపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. తక్కువ ధరలో నచ్చిన టీవీని కొనేసుకోండి..

ఆ తరువాత, నింపిన అప్లికేషన్, డాక్యుమెంట్లను మీ సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ లేదా పోస్టాఫీసు బ్రాంచ్‌కు తీసుకెళ్లండి. అలాగే అన్ని డాక్యుమెంట్ల ఒరిజినల్ కాపీలను కూడా తీసుకెళ్లండి. అనంతరం మీరు అకౌంట్ ఓపెన్ చేసే బ్యాంకు లేదా పోస్టాఫీసు ఉద్యోగులు ఫారమ్‌ను చెక్ చేయాలి. జత చేసిన డాక్యుమెంట్లను ఒరిజినల్ డాక్యుమెంట్లతో చెక్ చేస్తారు. ఆ తరువాత మీ కుమార్తె పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది.