TCL Smart TVs : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? ఈ TCL స్మార్ట్‌టీవీలపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. తక్కువ ధరలో నచ్చిన టీవీని కొనేసుకోండి..
TCL Smart TVs Price : స్మార్ట్‌టీవీ ఏది కొనాలో తెలియడం లేదా? అమెజాన్‌లో టీసీఎల్ కంపెనీ స్మార్ట్‌టీవీలపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఏకంగా 75 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. మీకు నచ్చిన టీవీని కొనేసుకోవచ్చు.

TCL Smart TVs Price
TCL Smart TVs Price : కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే మీకు మంచి అవకాశం. మీ పాత టీవీని అప్‌గ్రేడ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. ఇప్పుడే అద్భుతమైన ఫీచర్లతో కూడిన పెద్ద స్మార్ట్‌టీవీలను కొనేసుకోండి. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ టీసీఎల్ స్మార్ట్‌టీవీలపై 75శాతం వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
ఈ స్మార్ట్‌టీవీలు ప్రీమియంతో పాటు మరింత సరసమైన ధరకే లభ్యమవుతున్నాయి. 4K రిజల్యూషన్, డాల్బీ ఆడియో, గూగుల్ టీవీ వంటి టాప్ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ టాప్ మోడల్ స్మార్ట్‌టీవీలు మూవీలు, నైట్స్, గేమింగ్, స్ట్రీమింగ్‌కు సరైనవి. టీసీఎల్ స్మార్ట్ టీవీని తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టీసీఎల్ స్మార్ట్‌టీవీలపై టాప్ డిస్కౌంట్లు :
టీసీఎల్ హై క్వాలిటీ డిస్‌ప్లే, స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పుడు ఈ టీవీని అతి తక్కువ ధరలకు పొందవచ్చు. మీరు బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ కోరుకుంటున్నారా లేదా ప్రీమియం QLED ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటున్నారా? ప్రతిదానికి TCL TV మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న టాప్ డీల్స్ ఓసారి చెక్ చేయండి.
TCL 50C61B అద్భుతమైన ఆప్షన్లు :
టీసీఎల్ 50C61B అనేది 50-అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ QLED గూగుల్ టీవీ. అద్భుతమైన విజువల్స్, ఆకర్షణీయమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 71శాతం భారీ తగ్గింపుతో ఇప్పుడు కేవలం రూ. 32,990 (అసలు ధర రూ.1.14 లక్షలు)కు లభిస్తుంది. డాల్బీ విజన్, అట్మాస్, గూగుల్ టీవీతో అద్భుతమైన ఆప్షన్ కలిగి ఉంది.
TCL 32L4B బెస్ట్ మోడల్ :
కాంపాక్ట్, బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ కోసం చూస్తున్న కొనుగోలుదారులకు TCL 32L4B అనేది 32-అంగుళాల HD రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీ. ఇప్పుడు 52శాతం తగ్గింపు తర్వాత రూ. 9,990 (అసలు ధర రూ. 20,990)కు లభ్యమవుతుంది. HDR10, డాల్బీ ఆడియో, బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. చిన్న గదులకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
TCL 75P71B ప్రోపై భారీ డిస్కౌంట్ :
టీసీఎల్ 75P71B ప్రో మోడల్ 75-అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ QLED గూగుల్ టీవీ.. డాల్బీ విజన్-అట్మాస్, AiPQ ప్రో ప్రాసెసర్‌తో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ప్రారంభంలో రూ. 2.59 లక్షల ధరకు లభించిన ఈ టీవీ ఇప్పుడు తగ్గింపుతో రూ.69,990కే లభిస్తుంది. అంటే 73శాతం తగ్గింపుతో అత్యుత్తమ హై-ఎండ్ డీల్ అందిస్తోంది.
టీసీఎల్ స్మార్ట్ టీవీలపై ఆకర్షణీయమైన డీల్స్ :
- TCL 55C61B (55-అంగుళాల 4K అల్ట్రా HD QLED గూగుల్ టీవీ) : రూ. 36,990 (69శాతం డిస్కౌంట్)
- TCL 43C655 (43-అంగుళాల 4K అల్ట్రా HD QLED గూగుల్ టీవీ) : రూ. 27,990 (55శాతం డిస్కౌంట్)
- TCL 65C61B (65-అంగుళాల 4K అల్ట్రా HD QLED గూగుల్ టీవీ) : రూ. 60,990 (63శాతం డిస్కౌంట్)
- TCL 55V6B (55-అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED గూగుల్ టీవీ) : రూ. 31,990 (59శాతం డిస్కౌంట్)
ధర, వేరియంట్లు :
టీసీఎల్ స్మార్ట్ టీవీలు వివిధ స్క్రీన్ సైజులు, ఫీచర్ సెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ లెవల్ మోడళ్లకు ధరలు రూ. 9,990 నుంచి ప్రారంభమవుతాయి. అడ్వాన్సడ్ ఫీచర్‌లతో కూడిన ప్రీమియం బిగ్-స్క్రీన్ టీవీల ధరలు రూ. 69,990 వరకు ఉంటాయి.