Oppo Reno 10 Series Launch Set for May 24; Colour Options, RAM and Storage Configurations Teased
Oppo Reno 10 Series Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మే 24 వరకు ఆగాల్సిందే.. చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో నుంచి రెనో 10 సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ముందుగా చైనా మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ మేరకు ఒప్పో తమ అధికారిక వెబ్‌సైట్లో కొత్త రెనో సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ధృవీకరించింది. ఈ ఒప్పో లైనప్‌లో సాధారణ Oppo Reno 10, Reno 10 Pro, Reno 10 Pro+ ఉన్నాయి. చైనాలోని అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా హ్యాండ్‌సెట్‌పై ముందస్తు రిజర్వేషన్‌లను ప్రారంభించింది. ఈ మూడు ఫోన్‌లు 16GB వరకు RAM, 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో 3 కలర్ ఆప్షన్లలో వస్తాయి. రాబోయే అన్ని మోడల్‌లు ColorOS 13.1పై రన్ అవుతాయి. MariSilicon X NPUని కలిగి ఉంటాయి.
ఒప్పో రెనో 10 సిరీస్ మే 24న లాంచ్ కానుంది. ఈ లాంచ్ ఈవెంట్ చైనాలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు (12:00pm IST) ప్రారంభం కానుంది. Oppo Reno 10, Reno 10 Pro, Reno 10 Pro+ డిజైన్, స్పెసిఫికేషన్‌లను కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రత్యేక ల్యాండింగ్ పేజీ ద్వారా అందిస్తోంది. హోల్ పంచ్ కటౌట్‌తో కర్వడ్ డిస్‌ప్లేతో రానుంది. ఈ మూడు మోడల్‌లు మారిసిలికాన్ X NPUని కలిగి ఉంటాయి. వెనుకవైపు మల్టీ కెమెరా సెన్సార్‌లతో వస్తుంది. ColorOS 13.1లో కూడా రన్ అవుతాయి.
Oppo Reno 10 Series Launch Set for May 24; Colour Options
ఒప్పో చైనాలోని అధికారిక వెబ్‌సైట్ ద్వారా (Oppo Reno 10) సిరీస్ కోసం ముందస్తు రిజర్వేషన్‌లను అంగీకరించింది. ఒప్పో రెనో 10 Pro+, Oppo Reno 10 Pro ఫోన్ 256GB, 512GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్‌లలో 16GB RAM స్టాండర్డ్‌గా అందుబాటులో ఉండనుంది. ఒప్పో Reno 10 Pro+ బ్రిలియంట్ గోల్డ్, మూన్ సీ బ్లాక్, ట్విలైట్ పర్పుల్ (చైనీస్) షేడ్స్‌లో అందించనుంది. ఒప్పో Reno 10 Pro, Oppo Reno 10 ఫోన్లు బ్రిలియంట్ గోల్డ్, కలర్‌ఫుల్ బ్లూ, మూన్ సీ బ్లాక్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది.
వనిల్లా మోడల్ 3 RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో 8GB + 256GB, 12GB +256GB, 12GB+ 512GB అందించనుంది. అయితే, ప్రస్తుతానికి ధర వివరాలు తెలియరాలేదు. Oppo Reno 10 లైనప్ భారత మార్కెట్లో కూడా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. టిప్‌స్టర్ ముకుల్ శర్మ (@స్టఫ్‌లిస్టింగ్స్) ట్వీట్ ప్రకారం.. ఒప్పో రెనో 10, రెనో 10 Pro, Reno 10 Pro+ ఆప్షన్ కలర్ వేరియంట్‌లు ఈ ఏడాది జూన్ లేదా జూలై ప్రారంభంలో దేశంలో లాంచ్ కానున్నాయి.
Read Also : WhatsApp Chat Lock : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఈ చాట్ లాక్ ఫీచర్ అందరూ వాడొచ్చు..!