Best 5G Phones : రూ. 40వేల లోపు 5G ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు.. మీకు నచ్చిన ఫోన్ ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
Best 5G Phones : రూ. 40వేల లోపు 5G ఫోన్లలో Pixel 7a, OnePlus 11R, iQOO Neo 7 తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌ల ద్వారా మాత్రమే తగ్గింపు ఆఫర్లను పొందవచ్చు.

Looking for 5G phones under Rs 40,000, Pixel 7a and more available at discounted prices in India
Best 5G Phones Under Rs 40K in India : భారత మార్కెట్లో రూ. 40వేల లోపు 5G ఫోన్ల కోసం చూస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజాలైన (Amazon) లేదా (Flipkart)లో ఎలాంటి సేల్ ఈవెంట్లు జరగడం లేదు. కానీ, మీరు ఇప్పటికీ గూగుల్ (Pixel 7a), ఇతర ఫోన్లపై భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ (OnePlus 11R), iQOO Neo 7 కూడా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. అయితే, మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లను కలిగి ఉంటే మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని గమనించాలి. ఇలాంటి 5G ఫోన్లపై మరిన్ని డిస్కౌంట్లను పొందడానికి ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా ఎంచుకోవచ్చు. రూ. 40వేల లోపు 5G ఫోన్ల కోసం చూస్తున్నారా? Pixel 7a సహా ఇతర ఫోన్లపై తగ్గింపు ఆఫర్లను ఓసారి పరిశీలిద్దాం..
Pixel 7a ధర తగ్గింపు :
పిక్సెల్ 7a భారత మార్కెట్లో లాంచ్ అయింది. లేటెస్ట్ మిడ్-రేంజ్ 5G ఫోన్ బ్యాంక్ కార్డ్ ఆఫర్‌తో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. మీరు HDFC బ్యాంక్ కార్డ్‌లను కలిగి ఉంటే. Pixel 7aని ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 39,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 43,999 ఉంటే.. మీరు ఈ బ్యాంక్ కార్డ్ ద్వారా Pixel 7aపై రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. సరసమైన ధరలో వైబ్రెంట్ డిస్ప్లే, గ్రేట్ కెమెరా, ప్రీమియం డిజైన్ కలిగి ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ టెక్, IP67 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది.

Looking for 5G phones under Rs 40,000, Pixel 7a and more available at discounted prices in India
గూగుల్ ఫ్లాగ్షిప్ టెన్సర్ G2 SoC, 18W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 4,300mAh బ్యాటరీని అందిస్తుంది. రిటైల్ బాక్స్‌లో ఛార్జర్ రాదు. పాత ఛార్జర్‌ని మాత్రమే ఉపయోగించుకోవాలి. లేదంటే కొత్త ఛార్జర్ కొనుగోలు చేయవచ్చు. చాలా ఆండ్రాయిడ్ ఫోన్లను అందించదు. బ్యాంక్ కార్డ్‌పై డిస్కౌంట్ ఆఫర్ లిమిటెడ్ కాల వ్యవధి వరకు అందుబాటులో ఉంటుంది. మీరు HDFC బ్యాంక్ కార్డ్‌ని కలిగి ఉంటే.. మీరు ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 4వేలు అదనంగా చెల్లించాలి. ప్రస్తుతం ఈ ఆఫర్ గడువు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.
OnePlus 11R :
ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 11R ఫోన్ రూ. 39,722 తగ్గింపు ధరతో లిస్టు అయింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 1,250 తగ్గింపు కూడా అందిస్తోంది. ఈ బ్యాంక్ ఆఫర్ ధరను రూ. 38,472కి తగ్గించింది. కొంచెం మెరుగైన పనితీరు, పెద్ద బ్యాటరీతో వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ పొందవచ్చు. Pixel 7aకి బదులుగా OnePlus 11Rని కొనుగోలు చేయొచ్చు. Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్సెట్, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5,000mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, కెమెరా పిక్సెల్ 7a అంత మంచిది కాదు. OnePlus బాక్స్‌లో ఛార్జర్‌ను కూడా అందిస్తుంది. ఛార్జర్ కోసం అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

Looking for 5G phones under Rs 40,000, Pixel 7a and more available at discounted prices in India
iQOO Neo 7 :
అమెజాన్‌లో ఐక్యూ Neo 7 అసలు ధర రూ. 29,999 వద్ద లిస్టు అయింది. అయితే, HDFC, ICICI బ్యాంక్ కార్డ్‌లపై డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ బ్యాంకు కార్డులను ఉపయోగించి పేమెంట్లు చేస్తే వినియోగదారులు రూ.2వేలు తగ్గింపు పొందుతారు. ఈ ఫోన్ ధరను రూ.27,999కి తగ్గించింది. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ 5G ఫోన్ పొందవచ్చు.

Looking for 5G phones under Rs 40,000, Pixel 7a and more available at discounted prices in India
ఇందులో MediaTek డైమెన్సిటీ 8200 SoCని ఉపయోగిస్తోంది. 120W ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేస్తుంది. 120Hz HDR 10+ డిస్ప్లే బాగుందని చెప్పవచ్చు. భారీ డిస్కౌంట్లను కోరుకునే కొనుగోలుదారులు సేల్ ఈవెంట్లను హోస్ట్ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం వేచి ఉండాలి.