Realme 11 Pro Series : వచ్చే జూన్‌లో రియల్‌మి 11 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme 11 Pro Series : రియల్‌మి 11 ప్రో+ ఫోన్ భారత మార్కెట్లో జూన్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూ. 28వేలు లేదా రూ. 29వేల మధ్య ఉండవచ్చు. రాబోయే Realme 5G ఫోన్ లాంచ్ కావడానికి ముందే ఫీచర్లు లీకయ్యాయి.

Realme 11 Pro Series : వచ్చే జూన్‌లో రియల్‌మి 11 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme 11 Pro series India launch in June

Realme 11 Pro series India launch in June : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి (Realme 11 Pro Series) వచ్చే జూన్‌లో భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే కంపెనీ లాంచ్ టైమ్‌లైన్‌ను ధృవీకరించింది. అయితే, రాబోయే ప్రీమియం 5G ఫోన్‌ కచ్చితమైన తేదీని మాత్రం వెల్లడించలేదు.

రియల్‌మి ఈ సిరీస్‌లో రెండు మోడళ్లను ప్రకటించే అవకాశం ఉంది. అందులో ఒకటి ప్రైమరీ మోడల్, మరొకటి ప్లస్ వేరియంట్. లాంచ్ ఈవెంట్ ముందు Realme 11 Pro+ కొన్ని ఫీచర్లు లీకయ్యాయి. అందులో కంపెనీ కొన్ని విషయాలను ధృవీకరించింది. రాబోయే రియల్‌మి ఫోన్‌ల ధర, స్పెసిఫికేషన్‌లు ఏమి ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం..

రియల్‌మి 11 Pro, 11 Pro+ లీకైన ధరలివే :
రియల్‌మి 11 ప్రో భారత మార్కెట్లో ధర రూ. 22వేలు లేదా రూ. 23వేల మధ్య ఉండొచ్చునని టిప్‌స్టర్ దేబయన్ రాయ్ (గాడ్జెట్స్‌డేటా) తెలిపారు. Realme 11 Pro+ ధర రూ. 28వేలు లేదా రూ. 29వేలుగా ఉండవచ్చు. చైనాలో, ప్లస్ మోడల్ (12GB + 256GB) మోడల్ RMB (2,099)కి విక్రయించనుంది. అదే మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా భారత్‌లో దాదాపు రూ. 24,900 ఉండవచ్చు.

Read Also : Twitter CEO Elon Musk : పొరపాటు మాదే.. కొంతమంది ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు సరైనది కాదు.. మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటున్నాం..!

రియల్‌మి 11 Pro+ స్పెసిఫికేషన్‌లు ఇవే :
రియల్‌మి 11 Pro+ వెనుక 200-MP ప్రైమరీ కెమెరాతో వస్తుందని అధికారిక టీజర్‌లు ధృవీకరించాయి. లేటెస్ట్ ఆఫర్‌తో యూజర్‌లు గొప్ప కెమెరా అనుభూతిని పొందుతారని కంపెనీ పేర్కొంది. రియల్‌మి11 Pro+ తక్కువ ధర పరిధిలో 200-MP కెమెరాతో రానున్న ప్రపంచంలోనే మొదటి ఫోన్ కానుంది. వెనుక భాగంలో లెదర్ ఎండ్, వెనుక ప్యానెల్ వద్ద పెద్ద వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఫ్రేమ్‌లు గోల్డెన్ కోటింగ్ కలిగి ఉంటాయి. వెనుక ప్యానెల్‌లో ఆఫ్-వైట్ కలర్‌తో ఉంటాయి. ఈ ఫోన్ డిజైన్ కొంతవరకు ప్రీమియం నోకియా ఫోన్‌ల మాదిరిగా ఉండనుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మిగతా వివరాలను కంపెనీ రివీల్ చేయలేదు.

Realme 11 Pro series India launch in June

Realme 11 Pro series India launch in June

ఈ డివైజ్ ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు లీకయ్యాయి. రియల్‌మి 11 Pro+ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో 200-MP ప్రధాన కెమెరా, 8-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2-MP సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 32MP కెమెరా కూడా ఉంది. రియల్‌మి 11 Pro+ ఫోన్ హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 7050 SoC ఉంది. 12GB వరకు RAM, 1TB స్టోరేజీతో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించుకోవచ్చు. హుడ్ కింద కొత్త రియల్‌మి ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ను కలిగి ఉంది. మెరుగైన సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం డాల్బీ అట్మోస్‌కు కూడా సపోర్టు అందిస్తుంది.

Read Also : Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్‌పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!