Oppo Reno 11 Series With 50-Megapixel Triple Rear Cameras
Oppo Reno 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో నుంచి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఒప్పో రెనో 11 ప్రో, రెనో 11 సిరీస్ గురువారం (నవంబర్ 23) చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ కొత్త ఒప్పో రెనో 11 సిరీస్ ఈ ఏడాదిలో మేలో లాంచ్ అయిన రెనో 10 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చింది. ఈ కొత్త మోడల్‌లు ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్‌ఓఎస్ 14పై రన్ అవుతాయి. అంతేకాదు.. 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. 12జీబీ ర్యామ్ గరిష్టంగా 512జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఒప్పో ప్రకారం.. సాధారణ ఒప్పో రెనో 11 మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్ఓసీపై రన్ అవుతుంది. అయితే, ఈ ఒప్పో ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది.
ఒప్పో రెనో 11 ప్రో, ఒప్పో రెనో 11 ధర
ఒప్పో రెనో 11 ప్రో ధర 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర సీఎన్‌వై 3,499 (దాదాపు రూ. 41వేలు) నుంచి ప్రారంభమవుతుంది. 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 3,799 (దాదాపు రూ. 44వేలు). మూన్‌స్టోన్, అబ్సిడియన్ బ్లాక్, టర్కోయిస్ గ్రీన్ షేడ్స్‌లో అందిస్తుంది. సాధారణ ఒప్పో రెనో 11 ధర బేస్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర సీఎన్‌వై 2,499 (దాదాపు రూ. 29,000)గా నిర్ణయించింది. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 2,799 (దాదాపు రూ. 31,00) ఉంటుంది.
అయితే, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ కలిగిన టాప్-ఎండ్ మోడల్ ధర సీఎన్‌వై 2,999 (దాదాపు రూ. 35వేలు) ఉంటుంది. ఫ్లోరైట్ బ్లూ, మూన్‌స్టోన్, అబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఒప్పో రెనో 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ లైనప్ ఇండియా లాంచ్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
డ్యూయల్ సిమ్ (నానో) ఒప్పో రెనో 11 ప్రో పైన ఆండ్రాయిడ్ 14 ఆధారిత (ColorOS 14)పై రన్ అవుతుంది. 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, 450పీపీఐ పిక్సెల్ సాంద్రతతో 6.74-అంగుళాల 1.5కె (1,240×2,772 పిక్సెల్‌లు) ఓఎల్‌ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ 1,600 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని 240హెచ్‌జెడ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. ఇంకా, సెల్ఫీ షూటర్ కోసం కేంద్రంగా ఉన్న హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీతో పాటు 12జీబీ వరకు (LPDDR5x) ర్యామ్‌తో నడుస్తుంది. ర్యామ్ వర్చువల్‌గా 24జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఒప్పో రెనో 11 ప్రో :
ఫ్రంట్ సైడ్ కెమెరాలో ఒప్పో రెనో 11 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), 24ఎమ్ఎమ్ ఫోకల్ లెంగ్త్‌తో 50ఎంపీ ప్రైమరీ సోనీ ఐఎమ్ఎక్స్890 సెన్సార్‌తో రన్ అవుతుంది. కెమెరా యూనిట్‌లో 32ఎంపీ టెలిఫోటో కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం 32ఎంపీ ఆర్‌జీబీడబ్ల్యూ సోనీ ఐఎమ్‌ఎక్స్709 కెమెరా ఉంది. ఒప్పో రెనో 11 ప్రో మోడల్ 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్/ ఎ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ యూఎస్‌బీ టైప్-C పోర్ట్‌ను అందిస్తుంది.
Oppo Reno 11 Series Triple Rear Cameras
బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, జియోమాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, అండర్-స్క్రీన్ సామీప్య సెన్సార్, గ్రావిటీ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఐఆర్ కంట్రోల్ గైరోస్కోప్ ఉన్నాయి. ఈ ఫోన్ అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. ఒప్పో 80 డబ్ల్యూ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌తో రెనో 11 ప్రోలో 4,700ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఈ కొత్త సిరీస్‌ను ముందుగా కొనుగోలు చేసే యూజర్ల కోసం కంపెనీ 48 నెలల ఉచిత బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ 163×74.2×8.19ఎమ్ఎమ్ కొలతలు, 190 గ్రాముల బరువు ఉంటుంది.
ఒప్పో రెనో 11 స్పెసిఫికేషన్స్ :
ఒప్పో రెనో 11 మోడల్ రెనో 11 ప్రో మాదిరిగానే సిమ్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి. అయినప్పటికీ, వనిల్లా మోడల్‌లో 6.70-అంగుళాల (1,080×2,412 పిక్సెల్‌లు) ఓఎల్‌ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లే 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 950నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1హెచ్‌జెడ్ నుంచి 120హెచ్‌జెడ్ వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్ఓసీ ద్వారా ఆధారితంగా 12జీబీ వరకు ఎల్ పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ +12జీబీ వర్చువల్ మెమరీ 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ని అందిస్తుంది.
కెమెరా విషయానికి వస్తే..
ఒప్పో రెనో 11లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 26ఎమ్ఎమ్ ఫోకల్ లెంగ్త్, ఓఐఎస్ సపోర్ట్‌తో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ 600 సెన్సార్, 32ఎంపీ టెలిఫోటో సెకండరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం 32ఎంపీ షూటర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో సెన్సార్లు ఒప్పో రెనో 11 ప్రో మాదిరిగానే ఉంటాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్‌ను కూడా కలిగి ఉంది. ఒప్పో రెనో 11 67డబ్ల్యూ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్టుతో 4,800ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ కొలతలు 162.4×74.1×7.59ఎమ్ఎమ్, బరువు 184 గ్రాములు ఉంటుంది.
Read Also : Best Affordable Smartphones : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10వేల లోపు ధరలో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!