×
Ad

Oppo Reno 15 Series : పండగ చేస్కోండి.. ఒప్పో రెనో 15 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు!

Oppo Reno 15 Series : ఒప్పో రెనో 15 సిరీస్ వచ్చేసింది. ఒప్పో రెనో 15, రెనో 15 ప్రో, రెనో 15 ప్రో మినీ మోడల్స్ రిలీజ్ చేసింది. భారత మార్కెట్లో ధర, స్పెషిఫికేషన్లు, కెమెరా వివరాలపై ఓసారి లుక్కేయండి.

Oppo Reno 15 Series (Image Credit To Original Source)

  • ఒప్పో రెనో 15 ప్రో మినీ 6.32-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే
  • ఒప్పో రెనో 15 ప్రో వేరియంట్లలో 200MP మెయిన్ కెమెరాలు
  • ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16పై రన్ అవుతాయి
  • ఒప్పో రెనో 15 సిరీస్ 5G భారత్ లాంచ్ వివరాలు

Oppo Reno 15 Series : ఒప్పో ఫ్యాన్స్ కోసం మూడు అద్భుతమైన ఫోన్లు.. భారత మార్కెట్లోకి జనవరి 8న ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. 2025లో ఒప్పో రెనో 14 లైనప్‌ లాంచ్ చేయగా ఇప్పుడు ఆ ఫోన్లకు అప్‌గ్రేడ్ వెర్షన్ రెనో 15 సిరీస్‌ను రిలీజ్ చేసింది.

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రెగ్యులర్ రెనో 15, రెనో 15 ప్రోతో సరికొత్త రెనో 15 ప్రో మినీ కూడా తీసుకొచ్చింది. ఈ మినీ ఫోన్ హై-ఎండ్ హార్డ్‌వేర్‌‌తో రన్ అయ్యే కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్. ఒప్పో రెనో 15, రెనో 15 ప్రో మినీ, రెనో 15 ప్రో స్పెసిఫికేషన్లు, ధర ఎంత? ఎప్పుడు ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఒప్పో రెనో 15 స్పెషిఫికేషన్లు :
ఒప్పో రెనో 15 ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ 1,200 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ రోజువారీ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ఈ ఒప్పో ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6500mAh బ్యాటరీ అందిస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. 50MP మెయిన్ సెన్సార్, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. 50MP సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ColorOS 16పై రన్ అవుతుంది. IP66, IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది.

Oppo Reno 15 Series (Image Credit To Original Source)

ఒప్పో రెనో 15 ప్రో స్పెషిఫికేషన్లు :
ఒప్పో రెనో 15 ప్రో ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 3,600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే అందిస్తుంది. ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్, 3nm ప్రాసెస్‌పై రన్ అవుతుంది. 16GB వరకు ర్యామ్ అందిస్తుంది.

Read Also : Flipkart Republic Day Sale : గెట్ రెడీ.. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ డేట్ వచ్చేసింది.. ఈ ప్రొడక్టులపై ఆఫర్లే ఆఫర్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు..!

ఫొటోగ్రఫీ కోసం స్మార్ట్‌ఫోన్ 200MP మెయిన్ సెన్సార్‌ OISతో అందిస్తుంది. 50MP అల్ట్రా-వైడ్ 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ సపోర్టు ఇస్తుంది. బ్యాటరీ 6500mAh వద్ద ఉంది. కానీ, 80W వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ అందిస్తుంది.

ఒప్పో రెనో 15 ప్రో మినీ స్పెషిఫికేషన్లు :

ఒప్పో రెనో 15 ప్రో మినీ ఫోన్ ప్రో మోడల్ మాదిరిగానే 1.5K రిజల్యూషన్ బ్రైట్‌నెస్‌తో కాంపాక్ట్ 6.39-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. చిన్నసైజు అయినా అదే డైమెన్సిటీ 8450 చిప్‌సెట్, 200MP మెయిన్ సెన్సార్‌తో సింగిల్ కెమెరా హార్డ్‌వేర్‌‌తో వస్తుంది. 6200mAh బ్యాటరీతో ఫాస్ట్ వైర్డు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

భారత్‌లో ఒప్పో రెనో 15, ఒప్పో రెనో 15 ప్రో, ఒప్పో రెనో 15 ప్రో మినీ ధర :
ఒప్పో రెనో 15 ధర రూ.45,999, ఒప్పో రెనో 15 ప్రో మినీ ధర రూ.59,999 నుంచి ప్రారంభమవుతుంది. ఒప్పో రెనో 15 ప్రో ధర రూ.67,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ 3 మోడళ్ల సేల్స్ జనవరి 13 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్ ద్వారా ప్రారంభం కానున్నాయి.