OPPO Reno 16 Series : భారీ 7,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో ఒప్పో 2 కొత్త 5G ఫోన్‌లు.. ఫుల్ డిటెయిల్స్!

OPPO Reno 16 Series : ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి. భారీ 7,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో ఒప్పో 2 కొత్త 5G ఫోన్‌లు లాంచ్ కానున్నాయి.. పూర్తి వివరాలివే..

OPPO Reno 16 Series

OPPO Reno 16 Series : కొత్త ఒప్పో సిరీస్ వచ్చేస్తోంది. మే 25న చైనాలో ఒప్పో కొత్త రెనో 16 సిరీస్‌ లాంచ్ చేయనుంది. ఇందులో ఒప్పో రెనో 16, రెనో 16 ప్రో ఉన్నాయి. ఈ 5జీ ఫోన్‌లలో 200MP కెమెరా, 7000mAh బ్యాటరీకి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఒప్పో మే 25న చైనాలో రెండు కొత్త 5G ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఒప్పో రెనో 16, రెనో 16 ప్రోలతో ఒప్పో రెనో 16 సిరీస్‌లో భాగంగా కంపెనీ ఈ ఫోన్లను ప్రవేశపెడుతోంది.

కంపెనీ ఇటీవల రెనో 16 సిరీస్ కెమెరా స్పెసిఫికేషన్లను (OPPO Reno 16 Series) కూడా వెల్లడించింది. అయితే, ఈ డివైజ్‌లకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

నివేదికల ప్రకారం.. ఒప్పో రెనో 16 సిరీస్‌లో మీడియాటెక్ చిప్‌సెట్, ట్రిపుల్-కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉండవచ్చు. ముందుగా ఈ రెండు ఒప్పో ఫోన్ల లాంచ్ వివరాలను పరిశీలిద్దాం..

ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్ వివరాలు :
ఒప్పో కొత్త రెనో 16 సిరీస్ మే 25వ తేదీన సాయంత్రం 6:00 గంటలకు (IST) చైనాలో లాంచ్ కానుంది. వచ్చే నెలలో భారత మార్కెట్లో లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. అయితే, ఈ కొత్త సిరీస్‌తో పాటు రెనో 16C, రెనో 16 ప్రో మినీ మోడళ్లను కూడా కంపెనీ భారత మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఒప్పో రెనో 16 సిరీస్ స్పెసిఫికేషన్లు :
స్పెసిఫికేషన్ల పరంగా పరిశీలిస్తే.. ఒప్పో రెనో 16, ఒప్పో రెనో 16 ప్రో గత మోడళ్ల కన్నా అనేక ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లతో వస్తుందని అంచనా. ఈ ఫోన్లలో పర్ఫార్మెన్స్, ఇమేజింగ్ రెండింటిలోనూ భారీ అప్‌గ్రేడ్‌లను పొందవచ్చు.

Read Also : OPPO Enco Air 5s : మ్యూజిక్ లవర్స్‌కు పండుగే.. ANC పవర్‌తో ఒప్పో ఎన్కో ఎయిర్ 5S.. 48 గంటలు నాన్‌స్టాప్! 

ఒప్పో రెనో 16 ఫోన్ కాంపాక్ట్ 6.32-అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండగా, ఒప్పో రెనో 16 ప్రో భారీ 6.78-అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో ఉండవచ్చు.

ఈ రెండు ఒప్పో ఫోన్లలో 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తాయని భావిస్తున్నారు. ఒప్పో రెనో 16 మీడియాటెక్ డైమెన్సిటీ 8550 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా వేయగా, ఒప్పో రెనో 16 ప్రో మరింత పవర్‌ఫుల్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్‌‌గా ఉండవచ్చు.

ఒప్పో రెనో 16 సిరీస్ కెమెరా స్పెసిఫికేషన్లు :
కెమెరాల విషయానికొస్తే.. రెండు ఒప్పో డివైజ్‌లలోనూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఇందులో 200MP శాంసంగ్ HP5 ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.

వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68,IP69 రేటింగ్ ఉంటుందని అంచనా. ఈ సిరీస్‌లోని 2 మోడళ్లు LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్‌తో వస్తాయని అంచనా. ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పర్ఫార్మెన్స్, ఫాస్ట్ యాప్ లోడింగ్‌ అందిస్తాయి.

ఈ సిరీస్‌లో బ్యాటరీ లైఫ్ కోసం ఒప్పో రెనో 16లో 6,700mAh బ్యాటరీ, రెనో 16 ప్రోలో భారీ 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంటాయని అంచనా. ఈ రెండు ఒప్పో ఫోన్లలో 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి.