Oppo will launch the first full-level waterproof phone in the world on April 12
Oppo Waterproof Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రాబోయే ఈ కొత్త ఒప్పో ఫోన్ పూర్తి స్థాయి వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో ప్రపంచంలోనే మొదటి డివైజ్‌గా కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఫోన్ ఒప్పో A3 ప్రో అనే పేరుతో మార్కెట్లోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్ 12న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం. ఐపీ69 రేటింగ్‌కు సపోర్టు ఇచ్చే ఈ డివైజ్ డస్ట్‌ప్రూఫ్, వాటర్‌ప్రూఫ్‌గా రానుంది.
ఒప్పో ఎ3 ప్రో డిస్‌ప్లే వాటర్‌ప్రూఫ్, ఫాల్స్‌కు రెసిస్టెంట్ అని కంపెనీ పేర్కొంది. ఒప్పో ‘సూపర్ డ్యూరబుల్’ అని తెలిపింది. 5జీ ఫోన్ మొదట చైనాలో లాంచ్ కానుంది. ఆ తరువాత ఇతర మార్కెట్‌లలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి, ఒప్పో ఎ3 ప్రో భారత మార్కెట్లో ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. అయినప్పటికీ, ఒప్పో బ్రాండ్ గతంలో దేశంలో ఎ సిరీస్ ఫోన్‌లను కూడా లాంచ్ చేసింది. ఈ ఎ సిరీస్ ఫోన్‌కు సంబంధించి కొన్ని స్పెషిఫికేషన్లు ఇప్పటికే రివీల్ అయ్యాయి.
ఒప్పో ఎ3 ప్రో ఫోన్ ఫీచర్లు (అంచనా) :
ఒప్పో ఎ3 ప్రో ఫోన్ భారీ స్క్రీన్‌తో పాటు బ్యాటరీని కలిగి ఉందని ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో పేర్కొంది. టిప్‌స్టర్ ప్రకారం.. 6.7-అంగుళాల 1080పీ 120హెచ్‌జెడ్ ఓఎల్ఈడీ కర్వ్డ్ స్క్రీన్, హుడ్ కింద సాధారణ 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 5జీ చిప్, మీడియాటెక్ 7050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
12జీబీ ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజ్‌తో రానుంది. ఒప్పో ఎ3 ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని టీజర్‌లు సూచిస్తున్నాయి. ఈ డివైజ్ బ్యాక్ సైడ్ 64ఎంపీ ఎఫ్/1.7 ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను చూడవచ్చు. కెమెరా సెటప్‌కు సంబంధించి మిగిలిన వివరాలు తెలియరాలేదు.
రాబోయే చైనా లాంచ్‌పై కంపెనీ ప్రెసిడెంట్ బో లియు మాట్లాడుతూ.. ‘ఒప్పో డ్యూరబుల్ టెక్నాలజీ ఎ సిరీస్‌లో ప్రారంభమైంది. ఒప్పో ఎ3 ప్రో అనేది మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్. లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి-స్థాయి వాటర్‌ప్రూఫ్ ఫోన్’ అని పేర్కొన్నారు. యూజర్ ఫ్రెండ్లీ ఫోన్‌లలో ఈ కొత్త ఫోన్ ట్రెండ్ సెట్ చేస్తుందని, మొబైల్ పరిశ్రమను మరింత అభివృద్ధి చేస్తుందన్నారు. అదనంగా, ఒప్పో ఎ2 ప్రో నుంచి ‘నాలుగు ఏళ్ల బ్యాటరీ వారంటీ’ని అందిస్తుందని చెప్పారు.
Read Also : Motorola Edge 50 Pro Sale : భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 50ప్రో సేల్.. ఫీచర్లు అదుర్స్, లాంచ్ ఆఫర్లు, ధర ఎంతంటే?