PAN 2.0 : పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. కొత్త పాన్ 2.0 కార్డు వస్తోంది.. పాత కార్డు పనిచేస్తుందా? లేదా? ఫుల్ డిటైల్స్ మీకోసం..

PAN 2.0 Project : మీ పాన్ నంబర్‌ను మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న పాన్ హోల్డర్లు అదనపు ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసిన పాన్ కార్డ్‌ని ఉచితంగా అందుకుంటారు.

PAN 2.0 : పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. కొత్త పాన్ 2.0 కార్డు వస్తోంది.. పాత కార్డు పనిచేస్తుందా? లేదా? ఫుల్ డిటైల్స్ మీకోసం..

Will Your Old PAN Still Work

Updated On : November 26, 2024 / 7:29 PM IST

PAN 2.0 Project : దేశంలోని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారుల కోసం కేంద్ర ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. అదే సమయంలో, అప్‌గ్రేడ్ పాన్ క్యూఆర్ కోడ్‌తో వస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.

పన్ను చెల్లింపుదారులందరికీ ఎలాంటి ఛార్జీ లేకుండా జారీ అవుతుంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 1,435 కోట్లు ఖర్చవుతుందని కేంద్రం తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పాన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుందా అనేది ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్న. పాన్ 2.o గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం.

రూ. 1,435 కోట్ల పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని ప్రకటించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ పాన్ 2.o ప్రాజెక్ట్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ద్వారా పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవలను మారుస్తుందని, యాక్సెస్ చాలా సులభంగా ఉంటుందని, సేవల నాణ్యతను మెరుగుపరుస్తుందని తెలిపారు.

“ముఖ్యంగా మధ్యతరగతి, చిన్న వ్యాపారాలకు పాన్ కార్డ్ అనేది అంతర్భాగం. పాన్ 2.0 ఏకీకృత వ్యాపార గుర్తింపుగా పనిచేస్తుంది. పేపర్‌లెస్, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను నిర్ధారిస్తుంది ”అని కేంద్ర మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. కొత్త పాన్ కార్డ సిస్టమ్ ద్వారా ఇప్పటికే ఉన్న పాన్ కార్డ్‌లపై ప్రభావం గురించి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

మీ ప్రస్తుత పాన్ కార్డ్ చెల్లుబాటు కాదా?
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం.. మీ పాన్ నంబర్‌ను మార్చాల్సిన అవసరం లేదు. మీ ప్రస్తుత పాన్ చెల్లుబాటులో ఉంటుంది. అప్‌గ్రేడ్ చేసిన సిస్టమ్ ఇప్పటికే ఉన్న పాన్ కార్డులలో నేరుగా ఇంటిగ్రేట్ అవుతుంది.

మీరు కొత్త పాన్ కార్డ్ అందుకుంటారా? :
అవును. ఇప్పటికే ఉన్న పాన్ హోల్డర్లు అదనపు ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసిన పాన్ కార్డ్‌ని అందుకుంటారు.

అప్‌గ్రేడ్ చేసిన పాన్ కార్డ్‌లో ఏ కొత్త ఫీచర్లు ఉంటాయి? :
అప్‌గ్రేడ్ చేసిన పాన్ కార్డ్ భద్రతను మెరుగుపరచడానికి, త్వరిత ధ్రువీకరణ కోసం QR కోడ్‌తో సహా అడ్వాన్స్‌డ్ ఫీచర్‌లతో వస్తుంది.

మీరు పాన్ కార్డ్ అప్‌గ్రేడ్ కోసం చెల్లించాలా? :
అప్‌గ్రేడ్ ఉచితంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అప్‌గ్రేడ్ చేసిన పాన్ కార్డ్ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా పన్ను చెల్లింపుదారులకు డెలివరీ అవుతుంది.

మీరు కొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలా?
లేదు. మీరు కొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న పాన్ కార్డ్‌లు చెల్లుబాటు అవుతాయని అశ్విని వైష్ణవ్ ధృవీకరించారు. అయితే, మీరు కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసిన పాన్ కార్డ్‌ని అందుకుంటారు.

పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తుంది?
కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకారం.. “నిర్దిష్ట ప్రభుత్వ సంస్థల అన్ని డిజిటల్ సిస్టమ్‌లకు పాన్‌ను సాధారణ ఐడెంటిఫైయర్‌గా ఉపయోగించవచ్చు.

పాన్ 2.0 నుంచి వ్యాపారాలకు ఎలాంటి ప్రయోజనం ఉందంటే?:
PAN/TAN సర్వీసుల కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ నుంచి వ్యాపారాలు ప్రయోజనం పొందుతాయి. “ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ఉంటుంది, ఇది పూర్తిగా పేపర్‌లెస్, ఆన్‌లైన్‌లో ఉంటుంది. సిస్టమ్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. ప్రస్తుతమున్న 78 కోట్ల మంది పాన్ హోల్డర్లకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్‌తో కూడిన మెరుగైన కార్డులను ఉచితంగా అందిస్తుంది.

Read Also : Redmi A4 5G : రెడ్‌మి A4 5జీ ఫోన్ వాడుతున్నారా? ఎయిర్‌టెల్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్టు చేయదు.. ఎందుకంటే?