PAN-Aadhaar Linking
PAN-Aadhaar Linking : పాన్‌కార్డుదారులకు అలర్ట్.. ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయకపోతే మీ పాత పాన్ పనిచేయదు. నెలవారీగా చెల్లంచాల్సిన ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతాయి..మీ ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేశారా? లేదంటే వెంటనే చేసుకోండి. మరి గడువు తేదీ వరకు ఎదురుచూడొద్దు. ఆధార్-పాన్ కార్డు లింక్ చేయకపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుంది.
అది ఆర్థికంగానే కాదు.. ప్రభుత్వం (PAN-Aadhaar Link) నుంచి అందాల్సిన అనేక పథకాలు కూడా నిలిచిపోతాయి. అంతేకాదు.. మీకు రావాల్సిన నెల జీతం కూడా నిలిచిపోవచ్చు.. మీరు ఏమైనా మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీ వంటి పెట్టుబడులు ఉన్నా సంబంధిత రాబడులు నిలిచిపోవచ్చు. అందుకే.. భారతీయ పౌరులు ప్రతిఒక్కరూ తమ పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవడం తప్పనిసరి.
డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే గడువు ఉంది. ఈ తేదీలోగా లింక్ చేయకపోతే మీ పాన్ కార్డు పనిచేయకపోవచ్చు. మీ UID కార్డ్ (ఆధార్ కార్డ్)తో పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN)ను లింక్ చేయడం తప్పనిసరిగా ట్యాక్స్‌బడ్డీ ట్విట్టర్ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది.
“జనవరి 1, 2026 నుంచి మీ పాన్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుంది. ఐటీఆర్ దాఖలు చేయలేరు. రీఫండ్‌లు కూడా పొందలేరు. మీ నెల జీతం క్రెడిట్ అవ్వదు. SIP పెట్టుబడులు కూడా నిలిచిపోవచ్చు” అని టాక్స్‌బడ్డీ ట్వీట్‌లో పేర్కొంది. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసేందుకు అనేక మార్గాలను కూడా సూచించింది.
గతంలో కేంద్ర ప్రభుత్వం పాన్-ఆధార్ లింక్ గడువు తేదీని అనేక మార్లు పొడిగించింది. కానీ, ఇప్పుడు కొత్త గడువు తేదీని ఇంకా ప్రకటించలేదు. మీరు డిసెంబర్ 31, 2025 గడువు తేదీలోగా పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలి? లేదంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది.
అంతేకాదు.. మీకు నెలవారీ రావాల్సిన జీతం కూడా నిలిచిపోవచ్చు? అలాగే, మీ పెట్టుబడులు కూడా పెట్టలేరు లేదంటే దానిపై వచ్చే రాబడిని కూడా పొందలేరు. మీ బ్యాంక్ అకౌంట్లు కూడా బ్లాక్ అవ్వొచ్చు. చాలామంది పాన్ కార్డుదారులకు ఇలాంటి సందేహాలెన్నో ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలకు ధ్రువ అడ్వైజర్స్ పార్టనర్ దీపేష్ ఛేడా పూర్తి స్థాయిలో సమాధానమిచ్చారు. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయాలా? :
ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. అక్టోబర్ 1, 2024కి ముందు దాఖలు చేసిన ఆధార్ అప్లికేషన్ ఫారమ్ రిజిస్టర్ ఐడీ ఆధారంగా పాన్ కార్డు కేటాయించిన ప్రతి వ్యక్తికి ఆధార్ నంబర్‌ను డిసెంబర్ 31, 2025న లేదా అంతకు ముందు ఆదాయపు పన్ను (సిస్టమ్స్) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ లేదా ఆదాయపు పన్ను (సిస్టమ్స్) డైరెక్టర్ జనరల్ లేదా సదరు అధికారులచే అధికారం పొందిన వ్యక్తికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
డిసెంబర్ 31, 2025 నాటికి లింక్ చేయాల్సిన ప్రత్యేక గ్రూప్ ఇదే. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ జనరేట్ చేసినా ఆధార్ నంబర్ జారీ చేసిన తర్వాత కూడా లింక్ ప్రక్రియ పూర్తి కావాలి. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా యూజర్లను ఆన్‌లైన్‌లో సులభంగా ఆధార్‌ను పాన్‌కు లింక్ చేసేందుకు అనుమతిస్తుంది.
పాన్ ఆధార్‌తో లింక్ చేయాలా? ఐటీఆర్ దాఖలు చేయలేమా? :
గడువు తేదీలోగా పాన్-ఆధార్ లింకింగ్ పూర్తి చేయకపోతే.. మరుసటి రోజు నుంచి మీ పాన్ కార్డు పనిచేయదు. మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయలేరు లేదా ధృవీకరించలేరు. రీఫండ్ నిలిచిపోతాయి. పెండింగ్‌లో ఉన్న రిటర్న్‌లు ప్రాసెస్ చేయలేరు. TDS/TCS క్రెడిట్‌లు ఫారమ్ 26ASలో కనిపించకపోవచ్చు. టీడీఎస్, టీసీఎస్ అధిక రేట్లకు తొలగించవచ్చు. ఆ తర్వాత లింక్ చేసిన పాన్ మళ్లీ పనిచేస్తుంది. సాధారణంగా 30 రోజుల్లోపు పాన్ యాక్టివ్ అవుతుంది.
🚨Your PAN card will be deactivated from Jan 1 2026.
No ITR filing. No refunds.
Even your salary credit or SIP could fail.
Check this one important detail before 31st December 2025 deadline🧵👇
— TaxBuddy (@TaxBuddy1) November 3, 2025
చెల్లని పాన్ కార్డుతో కలిగే నష్టాలేంటి? పెట్టుబడి పెట్టలేమా? :
మీ బ్యాంక్ అకౌంట్ లేదా పెట్టుబడులు ఇప్పటికే యాక్టివ్‌గా ఉంటే.. తక్షణ ప్రభావం ఉండదు. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. కానీ, పనిచేయని పాన్ కొత్త పెట్టుబడులు, షేర్ ట్రేడ్‌లు లేదా కేవైసీ అప్‌డేట్‌లు వంటి ఆర్థికపరమైన పనులకు ఇబ్బందిగా మారొచ్చు. అధిక రేట్లతో పన్ను తగ్గించవచ్చు. మీ ఐటీఆర్ ఫైల్ చేయలేరు లేదా ప్రాసెస్ చేయలేరు. మీ ప్రస్తుత ఆస్తులపై ఎలాంటి ప్రభావం లేనప్పటికీ పాన్ కార్డు తిరిగి యాక్టివేట్ అయ్యే వరకు లావాదేవీలు చేయలేరు. పెట్టుబడులు కూడా పెట్టలేరు.
ఆధార్, పాన్ ఆదాయపు పన్ను పోర్టల్‌కు ఎవరు లింక్ చేయవచ్చు? :
ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. లింక్ ఆధార్ సర్వీసు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు (ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ లేదా రిజిస్టర్ కాని) అందుబాటులో ఉంది.
మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయవచ్చు? :
పాన్, ఆధార్‌తో లింకింగ్.. ముఖ్యమైన అంశాలివే :