Pandemic May Delay 5g Rollout In India, Says Airtel Ceo
5G Technology India : కొవిడ్ -19 మహమ్మారి కారణంగా భారతదేశంలో 5జీ టెక్నాలజీ సర్వీసు మరికొన్ని నెలలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్ అన్నారు. 5జీ యాక్షన్ డిసెంబర్ నాటికి జరగవచ్చునని భావిస్తున్నామని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ప్రభావంతో 5జీ సర్వీసు ప్రవేశపెట్టడానికి కొన్ని నెలలు ఆలస్యం కావచ్చనని అన్నారు.
గత జనవరిలో హైదరాబాద్‌లోని లైవ్ నెట్‌వర్క్‌లో భారతి ఎయిర్‌టెల్ 5జీని పరీక్షించిందని, నెట్‌వర్క్ వాణిజ్య ప్రయోగానికి పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పారు. మార్కెట్ వాటా ప్రకారం.. భారతదేశం రెండవ అతిపెద్ద ఆపరేటర్ 5జీ ప్రయోగానికి సిద్ధంగా ఉందని తెలిపారు. క్యాలెండర్ సంవత్సరం చివరినాటికి లేదా 2022 ప్రారంభంలో ఈ 5జీ సర్వీసును ప్రారంభించనుంది.
ఫిబ్రవరి 8న జరిగిన పార్లమెంటు ప్యానెల్ నివేదిక ప్రకారం.. 5జీని దశలవారీగా విడుదల చేయనున్నట్లు టెలికమ్యూనికేషన్ విభాగం (DoT) కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు. 5జీ సేవలకు స్పెక్ట్రం వేలాన్ని ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందనే దానిపై స్పష్టత లేదు. మార్చి త్రైమాసికంలో కంపెనీ Arpu అక్టోబర్-డిసెంబర్ నెలలో రూ. 166 నుంచి రూ.145కు పడిపోయింది. టెలికాం పరిశ్రమలో ఆదాయం 7-8శాతం ఉంది. ఆర్థిక సంవత్సరం 2020 మార్చి త్రైమాసికంలో రూ.135 నుంచి పెరిగింది.