Panel Summons Twitter : ట్విట్టర్‌కు సమన్లు.. 18న ప్యానెల్ ఎదుట హాజరుకావాలి

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌కు భారత పార్లమెంట్ షాకిచ్చింది. ఐటీ కొత్త నిబంధనల విషయంలో ట్విట్టర్ వైఖరిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్‌కు భారత పార్లమెంటు ప్యానల్ సమన్లు జారీ చేసింది.

Parliamentary Panel Summons Twitter : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్‌కు భారత పార్లమెంట్ షాకిచ్చింది. ఐటీ కొత్త నిబంధనల విషయంలో ట్విట్టర్ వైఖరిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్‌కు భారత పార్లమెంటు ప్యానల్ సమన్లు జారీ చేసింది. ట్విట్టర్ ఐటీ నిబంధనలను పాటించకపోవడంతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీచేసింది. ఈ నెల 18న ప్యానెల్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

కొత్త ఐటీ నిబంధనలు, ఇతర సమస్యలపై చర్చ జరపాలని నోటీసుల్లో పేర్కొంది. సోషల్ మీడియా గ్రూపులతో చర్చల కొనసాగింపు అవుతుంది. ఐటి రెగ్యులేషన్ నిబంధనలు, ఇటీవలి కొన్ని పరిణామాలపై ట్విట్టర్ భారత అధికారులను ఢిల్లీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఐటి రూల్స్ 2021 ప్రకారం అన్ని నిబంధనలను పాటించాలని ప్రభుత్వం ట్విట్టర్‌కు తుది నోటీసు ఇచ్చింది.

50 లక్షలకు పైగా వినియోగదారులతో కలిగిన అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఆదేశాలను పాటించాలని, వివిధ ప్లాట్‌ఫామ్‌లపై ఫిర్యాదులను పరిష్కరించడానికి రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించాలని కేంద్రం కోరింది. గతంలోనూ పార్లమెంటరీ కమిటీ అనేక సమస్యలపై ట్విట్టర్‌‌కు పలుసార్లు సమన్లు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలను పాటించడంపై ట్విట్టర్ మొండివైఖరిని ప్రదర్శించింది. కేంద్రం చివరి అవకాశం ఇస్తూ రాసిన లేఖకు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది. భారత చట్టాలకు కట్టుబడి ఉండేందుకు కొంత సమయం కావాలని కోరింది. భారత్‌లో గ్రీవెన్స్‌, నోడల్‌ అధికారులను నియమించింది.  ఫిబ్రవరి 25న ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను నోటిఫై చేసినట్లు ట్విట్టర్‌ గుర్తుచేసింది. మరోవైపు ఐటీ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ట్విట్టర్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు