Patna High Court To Buy Iphone 13 Pro 256gb For All Judges
Patna High Court : పట్నా హైకోర్టు కొత్త జడ్జీల కోసం కొత్త ఆఫర్ ప్రకటించింది. హైకోర్టులోని జడ్జీలందరికి ఆపిల్ ఐఫోన్ 13ప్రో అందించాలని పట్నా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. జడ్జీలందరికీ ఐఫోన్ 13ప్రో 256GB మోడల్‌ను ఇచ్చేందుకు అధికారక డీలర్లు, సరఫరాదారుల నుంచి హైకోర్టు టెండర్లను ఆహ్వానించింది. జీఎస్టీ, సర్వీస్ చార్జీలతో కలిపి ఐఫోన్ 13 ప్రో మోడల్స్ ధరలను తక్కువ ధరకే కోట్ చేయాలని సరఫరాదారులను కోర్టు కోరింది. సరఫరాదారులు, డీలర్లు జీఎస్టీ నెంబర్, పాన్ వివరాలు, ఆధార్, ఈమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వివరాలను టెండర్ నిబంధనల్లో పేర్కొంది.
అయితే టెండర్ జారీ చేసే సంస్ధ ప్రధాన కార్యాలయం, షాపు, వాణిజ్య సంస్ధ పట్నాకు చెందినదే ఉండాలని తెలిపింది. ఎలాంటి అడ్వాన్స్ పేమెంట్స్, బిల్లులు ఉండవని స్పష్టం చేసింది. క్యాష్ బదులుగా CFMS మోడ్ ద్వారా చెల్లింపులు ఉంటాయని తెలిపింది. పేమెంట్స్ పూర్తి అయ్యాక డుప్లికేట్ బిల్లు జారీ చేయడం జరుగుతుందని టెండర్ నోటీసులో పేర్కొంది.
Patna High Court To Buy Iphone 13 Pro 256gb For All Judges
ఆపిల్ ఐఫోన్ 13 ప్రో ఫోన్లకు సంబంధించి మెయింటెనెన్స్ సర్వీసులు అవసరమైనప్పుడు అందించేందుకు రెడీగా ఉండాలని సరఫరాదారులను పట్నా హైకోర్టు కోరింది. వారెంటీ పీరియడ్‌లో లోపాలు కలిగిన డివైజ్ లను ఆయా సంస్ధలు తక్షణమే రీప్లేస్ చేయాలని కోరింది. ఐఫోన్ 14 సిరీస్‌ను సెప్టెంబర్‌లో లాంచ్ చేసేందుకు ఆపిల్ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో పట్నా హైకోర్టు ఐఫోన్ 13 ఆర్డర్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ మోడల్స్ రిలీజ్ కానున్నాయి. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌తో సహా నాలుగు మోడల్‌లు రానున్నాయి. ప్రో మోడల్ డిజైన్, పర్ఫార్మెన్స్ రెండింటి పరంగా గత వెర్షన్ల కన్నా పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. ఐఫోన్ 14ప్రో పిల్-షేప్ డిజైన్‌తో వస్తుందని తెలిపింది.
Read Also : iPhone 13 : గుడ్ న్యూస్.. iPhone 13 ధర తగ్గిందోచ్.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్..!