Paytm Calculator : వావ్.. యూజర్లకే పండగే..! Paytmలో కాలిక్యులేటర్ ఫీచర్.. పేమెంట్ చేసే ముందే ఇలా చెక్ చేసుకోవచ్చు!
Paytm Calculator : పేటీఎంలో కొత్త పేమెంట్ కాలిక్యులేటర్ ఫీచర్ చూశారా? మీరు పేమెంట్ చేసే సమయంలో ఎంత కడుతున్నారో మొత్తం అమౌంట్ చెక్ చేయొచ్చు.. ఎలాగంటే?
- Sreehari A
- Published On : March 16, 2026 / 02:39 PM IST
Paytm Calculator
- పేటీఎం యూజర్ల కోసం కొత్త కాలిక్యులేటర్ ఫీచర్
- పేమెంట్ చేసేవారు పూర్తి లెక్కలు తెలుసుకోవచ్చు
- ఫైనల్ అమౌంట్ లెక్కేసి ఆ తర్వాతే పేమెంట్ చేయొచ్చు
- కాలిక్యులేటర్ కోసం థర్డ్ పార్టీ యాప్ అవసరం లేదు
Paytm Calculator : పీటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. మీకోసం కొత్త పేమెంట్ ఫీచర్ వచ్చేసింది. పేటీఎం పేమెంట్ స్క్రీన్‌లో ఇంటర్నల్ కాలిక్యులేటర్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై పేటీఎం వినియోగదారులు పేమెంట్ పూర్తి చేసే ముందు ఎంత చెల్లించనున్నారో ముందుగానే పూర్తి లెక్కలతో తెలుసుకోవచ్చు.
ఇకపై మీరు ఏ పేమెంట్ చేసినా ఆ పేమెంట్ మొత్తం ముందుగానే కౌంట్ చేసుకోవచ్చు. కొత్త పేమెంట్ స్క్రీన్‌లో ఎంత అమౌంట్ యాడ్ చేస్తారో చేసి ఆ లావాదేవీని పూర్తి చేయొచ్చు. రిటైల్ లావాదేవీల కోసం ఈ కాలిక్యులేటర్ ఫీచర్ వాడుకోవచ్చు.
ఈ ఫీచర్ పేటీఎంలో ఏదైనా పేమెంట్ చేసే సమయంలో ఆటో యాక్టివేట్ అవుతుంది. యాప్‌లోనే డైరెక్ట్ పేమెంట్ చేస్తే ఫైనల్ అమౌంట్ ఎంత అనేది అక్కడ కనిపిస్తుంది. దీనికోసం మీరు ప్రత్యేకించి స్పెషల్ కాలిక్యులేటర్ అప్లికేషన్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. పేటీఎంలోనే ఇన్ బిల్ట్ కాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది అనమాట.
కంపెనీ ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్లు, ఫార్మసీలు, లోకల్ షాపుల్లో పేమెంట్లు వంటి రోజువారీ రిటైల్ లావాదేవీల కోసం తీసుకొచ్చింది. ఇందులో వ్యక్తిగత వస్తువుల ధరలు తరచుగా పేమెంట్ చేసే ముందు కనిపిస్తాయి. మీ నెలవారీ బిల్లులు లేదా సర్వీసుల మొత్తాలను లెక్కించేందుకు ఈ పేటీఎం కాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు.
ఈ కాలిక్యులేటర్ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందంటే? :
పేటీఎం యాప్‌లో ఇంటర్నల్ కాలిక్యులేటర్ యాడ్ అయింది :
- పేటీఎం యాప్ ఓపెన్ చేయండి.
- పేమెంట్ చేసే ముందు QR కోడ్‌ను స్కాన్ చేయండి లేదంటే మీ కాంటాక్ట్‌ను ఎంచుకోండి లేదా UPI IDని ఎంటర్ చేయండి.
- అమౌంట్ ఎంట్రీ స్క్రీన్‌లో ఎంత పేమెంట్ చేస్తారో ఎంటర్ చేసేందుకు “+” ఐకాన్ ట్యాప్ చేయండి.
- ప్రతి అమౌంట్ ఎంటర్ చేయగానే మొత్తం ఆటోమాటిక్ గా క్యాలికిలేట్ అవుతుంది.
- పేమెంట్ మొత్తం ఎంత అనేది నెంబర్లు, లెటర్స్‌లో కనిపిస్తుంది.
- ఫైనల్ అమౌంట్ కన్ఫార్మ్ చేశాక UPI పిన్‌ను ఎంటర్ చేసి పేమెంట్ చేయడమే..
