PhonePe Offers : ఫోన్‌పే బంపర్ ఆఫర్.. బంగారం, వెండిపై క్రేజీ క్యాష్‌బ్యాక్… డోంట్ మిస్..!
PhonePe Offers : ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే (Phonepe) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫోన్‌పే యూజర్ల కోసం సూపర్ క్యాష్ బ్యాక్ తీసుకొచ్చింది.
- Sreehari A
- Published On : April 29, 2022 / 08:39 AM IST
Phonepe Offers Cashback On Gold, Silver Purchases Via Its App
PhonePe Offers : ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే (Phonepe) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫోన్‌పే యూజర్ల కోసం సూపర్ క్యాష్ బ్యాక్ తీసుకొచ్చింది. ఫోన్ పే యాప్ ద్వారా బంగారం, వెండి కొనుగోలు చేసినవారికి భారీగా క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఆఫర్ మే 3 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఫోన్ పే సంస్థ వెల్లడించింది. Phone Pe యాప్ ద్వారా 24 క్యారెట్ల గోల్డ్, వెరైటీ డిజైన్లలో గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్ల మాదిరిగా కొనుగోలుదారులకు డెలివరీ చేయనుంది. అంతేకాదు.. ఫోన్ పే ద్వారా గోల్డ్ కొంటే.. రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
వెండి నాణేలు, బార్ లను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.250 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఫోన్‌పే ద్వారా 99.99 శాతం స్వచ్ఛమైన బంగారంతో పాటు వెండిని కూడా కస్టమర్లు సొంతం చేసుకోవచ్చునని కంపెనీ వెల్లడించింది. ఫోన్ పే ద్వారా బంగారం కొనుగోలు చేస్తే దానికి విలువ ఉంటుందా? అంటే ఫోన్‌పే సంస్థ ఒక సర్టిఫికేట్ జారీ చేస్తోంది.
Phonepe Offers Cashback On Gold, Silver Purchases Via Its App
ఫేన్ పే ప్లాట్ ఫాం నుంచి స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేసే వారికి స్వచ్ఛతకు సంబంధించి సర్టిఫికేట్ అందిస్తామని వెల్లడించింది. ఫోన్ పే క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందాలంటే మే 3వ తేదీలోగా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు వెంటనే ఫోన్ పే ద్వారా బంగారం, వెండిని కొనేసుకోండి.. అద్భుతమైన క్యాష్ బ్యాక్ ను సొంతం చేసుకోండి.
Read Also : PhonePe యూజర్లకు షాక్.. ఇకపై ఛార్జీలు వసూలు
