Poco C75 Global Variant May Come With up to 8GB of RAM, 256GB of Storage
Poco C75 Global Variant Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. త్వరలో పోకో సి75 పేరుతో గ్లోబల్ వేరియంట్‌గా లాంచ్ కానుంది. నివేదిక ప్రకారం.. లాంచ్‌కు ముందే ఈ హ్యాండ్‌సెట్ గ్లోబల్ వేరియంట్ అనేక స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. మల్టీ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లతో రావచ్చు. అంతేకాదు.. ఈ పోకో ఫోన్ బ్లాక్ సహా మూడు ఇతర కలర్ ఆప్షన్లలో రావచ్చునని నివేదిక సూచిస్తుంది. ఇటీవలి వారాల్లో, ఈ హ్యాండ్‌సెట్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించింది.
పోకో సి75 వేరియంట్ స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
నివేదిక ప్రకారం.. పోకో సి65 6జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో రావచ్చు. బ్లాక్, బ్లూ, గ్రీన్, గోల్డ్ అనే మొత్తం 4 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ గీక్‌బెంచ్ జాబితా ప్రకారం.. 8 కోర్‌లతో కూడిన ఎంట్రీ-లెవల్ మీడియాటెక్ హీలియో చిప్‌సెట్‌తో రావచ్చు. రెండు పర్ఫార్మెన్స్ కోర్లు 2.0GHz, 6 సామర్థ్య కోర్‌లు 1.70GHz వద్ద ఉంటాయి.
పోకో సి75 సింగిల్-కోర్, మల్టీ-కోర్ టెస్టుల్లో వరుసగా 302, 1352 స్కోర్‌లను కలిగి ఉంది. మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ ప్రాసెసర్‌తో వస్తుంది. పోకో రాబోయే హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపర్‌ఓఎస్‌తో రన్ అవుతుందని అంచనా. భారత మార్కెట్లో పోకో సి65కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుందని భావిస్తున్నారు.
పోకో సి65 స్పెసిఫికేషన్‌లు :
పోకో సి65 6.74-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 720 x 1,600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ని కలిగి ఉంది. హుడ్ కింద, మీడియాటెక్ హెలియో జీ85 ఎస్ఓసీ ద్వారా అందిస్తుంది. దాంతో పాటు 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. పోకో సి65 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా, డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలకు 8ఎంపీ కెమెరాను కలిగి ఉంది. కొలతల పరంగా స్మార్ట్‌ఫోన్ 168 x 78 x 8.09 మిమీ, 192 గ్రాముల బరువు ఉంటుంది. యూఎస్‌బీ టైప్-సి ద్వారా 18డబ్ల్యూ వద్ద ఛార్జ్ చేయగల 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.