POCO M8X 5G : వారెవ్వా.. కిర్రాక్ డిస్కౌంట్.. భారీ బ్యాటరీతో పోకో 5G ఫోన్ మీ బడ్జెట్‌లోనే..!

POCO M8X 5G : పోకో M8x 5జీ ఫోన్ ప్రారంభ ధర కన్నా రూ. 3వేలు తక్కువకే లభిస్తోంది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ పోకో ఫోన్‌లో 7,900mAh బ్యాటరీ కూడా ఉంది. పూర్తి ఫోన్ ఆఫర్లు, ధర వివరాలివే..

  • Published on- September 12, 2026 / 09:55 PM IST

POCO M8X 5G

  • 7900mAh బ్యాటరీతో కొత్త పోకో 5G ఫోన్ అదుర్స్
  • ఇలా కొన్నారంటే రూ. 3వేలు తక్కువకే మీ సొంతం
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ డీల్ ఎలా పొందాలంటే?

POCO M8X 5G : పోకో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ఆఫర్.. 7900mAh బ్యాటరీతో బడ్జెట్-ఫ్రెండ్లీ ఫోన్‌ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర కన్నా రూ.3వేల వరకు తక్కువకే లభిస్తోంది. పోకో M8 సిరీస్‌లో ఇప్పటివరకు ఇదే అత్యంత సరసమైన ఫోన్. గతంలో ఈ సిరీస్‌లో పోకో M8 పవర్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రస్తుతం పోకో ఎం8ఎక్స్ 5జీ ఫోన్ డిస్కౌంట్ ధరకే ఇలా కొనేసుకోవచ్చు..

రూ. 3వేల తక్కువ ధరకు :
ఈ పోకో స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB, 6GB ర్యామ్ + 128GB అనే 2 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ధర రూ. 20,999 కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 22,999గా ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 2వేలు కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది.

రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో రూ. 17,999 ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, లెదర్ గ్రీన్, బ్లూ అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Read Also : SBI Fixed Deposit : SBIలో 3 ఏళ్ల FDపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? సీనియర్ సిటిజన్లకు నిజంగా జాక్ పాట్..!

పోకో M8x 5జీ ఫీచర్లు :
ఈ పోకో ఫోన్ 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. భారత మార్కెట్లో ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్‌సెట్‌తో వస్తుంది. 6GB వరకు LPDDR4x ర్యామ్, 128GB వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఈ ఫోన్ పవర్‌ఫుల్ 7900mAh బ్యాటరీతో వస్తుంది. 45W వైర్డ్, 22.5W రివర్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ఓఎస్ 3పై రన్ అవుతుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ అందిస్తుంది. వాటర్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది.

పోకో M8x 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్ కూడా ఉంది. ఈ ఫోన్ 5G, 4G, LTE, WiFi, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఈ పోకో ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.