Poco M8x 5G Launch : భలే ఉంది భయ్యా ఫోన్.. కొత్త పోకో M8x 5G కేక పుట్టిస్తోందిగా.. ఛార్జింగ్ టెన్షన్ లేదు..!

Poco M8x 5G Launch : పోకో M8ఎక్స్ 5జీ ఫోన్ వచ్చేసింది. 50MP కెమెరా, 3 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తోంది. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..

Poco M8x 5G Launch

  • 6.9-అంగుళాల HD+ డిస్‌ప్లే, 7900mAh బ్యాటరీ,
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్‌సెట్‌
  • 45W ఫాస్ట్ ఛార్జింగ్ 22.5W రివర్స్ ఛార్జింగ్‌

Poco M8x 5G Launch : పోకో నుంచి అద్భుతమైన ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో పోకో M8x 5జీ లాంచ్ అయింది. ఈ పోకో 5జీలో 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 7,900mAh బ్యాటరీ కూడా ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

పోకో M8x 5జీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. పోకో M8x 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పోకో M8x 5జీ ధర :
పోకో M8x 5జీ ధర రూ. 18,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ ఆగస్టు 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ సైట్‌లో అమ్మకానికి వస్తుంది. ఈ ఫోన్‌ను బ్లూ, లెదర్ గ్రీన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో కొనేసుకోవచ్చు.

పోకో M8x 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
పోకో M8x 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్ట్ అవుతుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64-రేటింగ్‌తో వస్తుంది. వెట్ టచ్ టెక్నాలజీ 2.0 కూడా ఉంది. ఈ ఫోన్‌ను తడి చేతులతో కూడా వాడొచ్చు. పోకో M8x 5జీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4జీ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

Read Also : Vivo T5 5G Launch : బ్యాటరీ బీస్ట్ వస్తోంది.. కొత్త వివో T5 5G ఫోన్ అదుర్స్, ధర, ఫీచర్లపై భారీ అంచనాలివే..!

6GB LPDDR4X ర్యామ్, 12GB వరకు యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. ట్రిపుల్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది. 7900mAh బ్యాటరీ కూడా ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 3 రోజుల వరకు ఛార్జ్ వస్తుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. :
పోకో M8x 5జీ బ్యాక్ సైడ్ 50MP ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 2x ఇన్-సెన్సార్ జూమ్‌తో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. డిజైన్ పరంగా ఈ ఫోన్ ప్రీమియం వేగన్ లెదర్ ఫినిష్‌తో గోల్డెన్ కెమెరా డెకో అందిస్తుంది.

మెటాలిక్ ఫినిష్ మిడిల్ ఫ్రేమ్ క్వాడ్-కర్వ్డ్ బ్యాక్ డిజైన్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ ఓఎస్‌పై రన్ అవుతుంది. కంపెనీ 4వ జనరేషన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ 6 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందించనుంది.