Poco X8 5G Series : పోకో ఫ్యాన్స్‌కు పండగే! సెప్టెంబర్ 4న X8 సిరీస్ ఎంట్రీ.. 10,000mAh బ్యాటరీతో పవర్‌ఫుల్ సర్‌ప్రైజ్!
Poco X8 5G Series : పోకో X8 5G, X8 Power 5G సెప్టెంబర్ 4న భారత్‌లో లాంచ్ కానున్నాయి. 10,000mAh వరకు బ్యాటరీ, 100W ఛార్జింగ్, అమోల్డ్ డిస్‌ప్లేతో ఈ ఫోన్లు రాబోతున్నాయి.. పూర్తి వివరాలు ఇవే..
- Sreehari A
- Published on- August 29, 2026 / 07:25 PM IST
Poco X8 5G and X8 Power 5G
- కొత్త పోకో ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫస్ట్ సేల్ త్వరలో ప్రారంభం
- పోకో ఎక్స్8 5జీ 9000mAh బ్యాటరీతో రానుందని కంపెనీ ప్రకటన
- సెప్టెంబర్ 4న భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం
Poco X8 5G Series : పోకో ఫ్యాన్స్ గెట్ రెడీ.. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో కొత్త పోకో సిరీస్ రాబోతుంది. పోకో X8 5జీ, పోకో X8 పవర్ 5జీ ఫోన్లు సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నట్లు పోకో ఇండియా అధికారికంగా వెల్లడించింది. పోకో వెబ్ పోర్టల్ ద్వారా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్లు సేల్ ప్రారంభం కానుంది.
ఈసారి పోకో ప్రధానంగా బ్యాటరీపై ఫోకస్ చేసినట్టు టీజర్లను చూసి చెప్పొచ్చు. పోకో X8 5జీలో ఏకంగా 9,000mAh బ్యాటరీ ఉండనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3.2 రోజుల వరకు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ అంటోంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.
పోకో X8 పవర్ 5జీ మాత్రం బ్యాటరీ పరంగా మరో లెవల్‌కు వెళ్లింది. ఇందులో 10,000mAh బ్యాటరీ, 100W వైర్డ్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ ఉండనున్నాయి. 3.5 రోజుల వరకు ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుందని పోకో టీజ్ చేసింది. ఈ రెండు ఫోన్లలోనూ బైపాస్ ఛార్జింగ్, PPS, స్మార్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉండనున్నాయి.
అమోల్డ్ డిస్‌ప్లే.. స్నాప్ డ్రాగన్ పవర్‌తో పోకో కొత్త ఫోన్లు :
లీక్ డేటాను పరిశీలిస్తే.. పోకో X8 పవర్ 5జీలో 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండొచ్చని అంచనా. స్నాప్ డ్రాగన్ 6 జెన్ 5 చిప్‌సెట్‌కు LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ రావొచ్చని అంచనా. కెమెరా పరంగా చూస్తే.. OISతో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్, 32MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని సమాచారం.
పోకో X8 5జీలో స్నాప్ డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్, 6.83-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 3,500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉండవచ్చని అంచనా. 50MP రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండొచ్చు.
డిజైన్ విషయానికి వస్తే..
పోకో X8 5జీ ఫోన్ ఆరెంజ్, వైట్ కలర్ ఆప్షన్లలో, వర్టికల్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. పోకో X8 పవర్ 5జీ మాత్రం ఎల్లో కలర్‌లో స్పెషల్ స్క్విర్కిల్ కెమెరా మాడ్యూల్‌తో ఆకట్టుకుంటోంది. ఈ రెండు ఫోన్లకు IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 4 Android OS అప్‌డేట్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు రావచ్చని అంచనా..
