POCO X8 Power 5G : 10000mAh బ్యాటరీతో కొత్త పోకో X8 పవర్ 5G ఫోన్.. ఫీచర్లు మాత్రం కిర్రాక్.. ధర జస్ట్ ఎంతంటే?

POCO X8 Power 5G : పోకో ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. 10000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో పోకో X8 పవర్ 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ ధర, కీలక ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..

POCO X8 Power 5G

  • 10,000mAh బ్యాటరీ, 32MP ఫ్రంట్ కెమెరా సెటప్
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌
  • లాంచ్ ఆఫర్లలో రూ. 2వేలు కూపన్ డిస్కౌంట్

POCO X8 Power 5G : పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. పోకో X8 పవర్ 5G భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 10,000mAh బ్యాటరీతో వస్తుంది. అడ్రినో 812 జీపీయూతో ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. పోకో X8 పవర్ 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరను ఓసారి పరిశీలిద్దాం..

ధర ఎంతంటే? :
పోకో ఎక్స్8 పవర్ 5జీ ఫోన్ 6జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999 కాగా, 8జీబీ+256జీబీ స్టోరేజ్ (POCO X8 Power 5G) వేరియంట్ ధర రూ. 38,999గా ఉంది. ఈ ఫోన్ సేల్ సెప్టెంబర్ 11న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. ఎల్లో, బ్లాక్ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా రూ. 2వేలు కూపన్ డిస్కౌంట్, రూ. 1,000 బ్యాంక్,ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :

పోకో X8 పవర్ 5జీ ఫోన్ 6.83-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 2772×1280 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3200Hz వరకు ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 3200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

Read Also : Samsung Galaxy F70e 5G : అద్భుతమైన డిస్కౌంట్.. ఈ శాంసంగ్ గెలాక్సీ F70e 5G చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనండి చాలు..!

సేఫ్టీ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ అడ్రినో 812 జీపీయూతో ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 8GB LPDDR5X ర్యామ్, 128GB యూఎఫ్ఎస్ 2.2/256GB యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమీ హైపర్ OS3పై రన్ అవుతుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే..
పోకో X8 పవర్ 5జీలో ఎఫ్/1.5 అపర్చర్, OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, కాలింగ్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.

డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్ IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ కొలతలు 163.44 మిమీ పొడవు, 78.27 మిమీ వెడల్పు, 8.65 మిమీ మందం, బరువు 229 గ్రాములు ఉంటుంది.

కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 5, బ్లూటూత్ 6.0, GPS, USB టైప్-సి 2.0 పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 10,000mAh బ్యాటరీ అమర్చారు. 100W హైపర్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.