Poco X8s Launch : పోకో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త Poco X8s వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్..!
Poco X8s Launch Soon : పోకో X8s త్వరలో మార్కెట్‌లోకి రానున్నట్లు సమాచారం. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్, 50MP కెమెరా, NBTC సర్టిఫికేషన్ సహా లీకైన స్పెసిఫికేషన్లు, పోకో X8 సిరీస్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- October 20, 2026 / 03:37 PM IST
Poco X8s Launch
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7వ జనరేషన్ 4 చిప్‌సెట్
- పోకో X8sలో 50MP ప్రైమరీ కెమెరా, స్పెసిఫికేషన్లు లీక్
- పోకో X8, పోకో X8 పవర్ భారత మార్కెట్లో లాంచ్
Poco X8s Launch Soon : పోకో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్ రేంజ్ కేటగిరీలో వస్తుందని భావిస్తున్నారు. పోకో ఎక్స్8, పోకో ఎక్స్8 పవర్ ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లోని స్టాండర్డ్ మోడల్‌కు పోకో ఎక్స్8ఎస్ అప్‌గ్రేడ్‌గా వస్తుందని అంచనా.
పోకో X8s పేరుతో రానున్న ఈ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. పవర్‌ఫుల్ ప్రాసెసర్, 50MP కెమెరాతో ఈ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకునేలా ఉండనుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..
పోకో X8s NBTC సర్టిఫికేషన్ :
మీడియా నివేదికల ప్రకారం.. పోకో X8s స్మార్ట్‌ఫోన్ థాయ్‌లాండ్‌కు చెందిన నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమిషన్ (NBTC) నుంచి ధ్రువీకరణ పొందింది. ఈ ఫోన్ మోడల్ నంబర్ 2609CPC5FGగా పేర్కొంటున్నారు. గతంలో ఈ స్మార్ట్‌ఫోన్ EEC, IECEE, IMDA వంటి సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లపై కూడా కనిపించింది. దీంతో ఈ ఫోన్ లాంచ్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.
Read Also : Moto G47 Power Leak : 7000mAh బ్యాటరీతో కొత్త మోటో G47 పవర్ వస్తోంది.. ఒక్క ఛార్జ్‌తో 78 గంటలపైనే బ్యాకప్!
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్.. 50MP కెమెరా :
లీక్‌ల ప్రకారం.. పోకో X8sలో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ఉండవచ్చని తెలుస్తోంది. ఫొటోగ్రఫీ కోసం 50MP ప్రైమరీ కెమెరాను అందించే అవకాశం ఉంది. అయితే, ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పోకో ఎక్స్8, ఎక్స్8 పవర్ ప్రత్యేకతలివే :
ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ అయిన పోకో X8 5జీలో 6.83 అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. అలాగే 16MP సెల్ఫీ కెమెరా, 9,000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
మరోవైపు, పోకో X8 పవర్ 5జీలో 6.83 అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్‌సెట్, 50MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 10,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. మొత్తంగా, పోకో X8s మరిన్ని అప్‌గ్రేడ్‌లతో వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
