Pollution Eating Car Shown Off At Goodwood Festival (1)
Pollution-eating Car : పర్యావరణంలో కాలుష్యాన్ని పీల్చేసే సరికొత్త కారు వచ్చేసింది. ఈ కారు నడుస్తున్నంత సేపు గాల్లోని కాలుష్యాన్ని లాగేసుకుంటుంది. మాములుగా ఇంధనతో నడిచే వాహనాల నుంచి కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి.. కానీ, ఈ కొత్త కారు మాత్రం గాల్లో కాలుష్యాన్ని పీల్చేసుకుంటుంది. మరోవైపు.. పొలుష్యన్ నివారణ కోసం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి.
పొల్యుషన్ పీల్చుకునే ఈ కొత్త కారును తయారుచేసిందో ఓ బ్రిటన్ కంపెనీ. ప్రముఖ డిజైనర్ థామస్ హీథర్ విక్ (Thomas Heatherwick) ఈ మోడ్రాన్ కారును తయారుచేశారు. కారు నడస్తున్నంత సేపు గాలిలోని కాలుష్యాన్ని పీల్చుకుంటుందని పేర్కొన్నారు. ఈ పొల్యుషన్ కారును షాంఘైలో జరిగిన (Goodwood Festival of Speed) ఈవెంటులో ప్రదర్శించారు. 2023 లోపు 10 లక్షల కార్లను తయారుచేయడమే లక్ష్యమని థామస్ అన్నారు.
ఒక కాలుష్య నివారణకు మాత్రమే కాదట.. అంతరిక్ష సంక్షోభం (Space Crisis) స్పేస్ క్రైసిస్‌ను పరిష్కరించేందుకు ఈ రాడికల్ డిజైన్ తయారుచేసినట్టు తెలిపారు. కాలిఫోర్నియా, లండన్‌లో గూగుల్ హెడ్‌క్వార్టర్స్ నిర్మాణంలో ఆర్కిటెక్చర్ ప్రాజెక్టులు చేపట్టిన థామస్ ఫేమస్ ఈ కొత్త కారులో బాగా పాపులర్ అయ్యారు. లండన్ న్యూ వెర్షన్ ఐకానిక్ Routemaster bus కూడా డిజైన్ చేస్తున్నారు.
కాలుష్యాన్ని పీల్చుకునే ఈ కారు విషయంలో విమర్శకుల్లో అనుమానం వ్యక్తం అవుతోంది. దాంతో ఈ కారు కాలుష్యాన్ని ఎలా పీల్చుకుంటుందో థామస్ వివరించారు. ఈ కారుకు పెద్ద గ్లాస్ రూఫ్ ఉంటుంది. కారు లోపల పెద్ద రూం మాదిరిగా ఉంటుంది. అడ్జస్టబుల్ చైర్లు ఉంటాయి. ఎలాగంటే అలా మార్చుకోవచ్చు. ఇక నిద్రపోయేందుకు బెడ్ కూడా ఉంది. మీటింగ్స్ పెట్టుకోవచ్చు.. భోజనం కూడా చేసేందుకు టేబుల్ ఉంది.
కారు ముందు భాగంలో గ్రిల్ వద్ద టెన్నిస్ బాల్ సైజ్‌లో ఫిల్టర్ అమర్చారు. దీని ద్వారా గాల్లో కాలుష్యాన్ని పీల్చుకుంటుంది. ఏడాదిలోగా ఆ సైజులో పొల్యూషన్‌ను స్టోర్ చేస్తుంది. చూడటానికి టెన్నిస్ బాల్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ మన ఊపిరితిత్తులంత సైజులో ఉంటుంది. ఇలాంటి కార్లు రోడ్లపైకి వస్తే గాలి కాలుష్యం తగ్గిపోతుందని థామస్ హీథర్విక్ చెప్పారు.