Credit Card Portability: మీ క్రెడిట్, డెబిట్ కార్డులకుకూడా పోర్టబిలిటీ సదుపాయం.. ఎప్పటి నుంచి..? ఎలానో తెలుసుకోండి..

ఆర్బీఐ తాజా నిర్ణయం అనుకున్న సమయానికి అమల్లోకి వస్తే.. కార్డు నెట్‌వర్క్‌ల మధ్య పోటీ నెలకొంటుంది. కార్డు నెట్‌వర్క్‌లు వినూత్న ఆఫర్లు, కస్టమర్లు మెచ్చేలా మెరుగైన పద్దతులు అమలు, ఆకర్షణీయమైన రివార్డ్ ప్రోగ్రాంలను పరిచయంచేసే అవకాశం ఉంటుంది.

Credit Card Portability

Card Network Portability : మీరు ఏ డెబిట్, క్రెడిట్‌లు వాడుతున్నారు..? మీకు ఆ నెట్‌వర్క్ సేవలు నచ్చడం లేదా? అయితే, మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ‌లా డెబిట్, క్రెడిట్ కార్డును వేరే నెట్‌వర్క్ సేవలకు మార్చుకోవాలని భావిస్తున్నారా? అయితే, కొద్దిరోజులు ఆగండి.. మీకు అందుబాటులోకి ఈ సదుపాయం కూడా వచ్చిచేరుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ 1 నుంచి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డు వినియోగదారులకు తమ ప్రాధాన్య కార్డు నెట్‌వర్క్‌ని ఎంచుకునే అధికారం కల్పించేలా ఆర్బీఐ కొత్త సర్క్యూలర్‌ను జారీ చేసింది. దీనిపై ప్రస్తుతం అభిప్రాయాలను కోరుతుంది. అక్టోబర్ 1నుంచి ఈ సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

UPI Credit Card Payments : గూగుల్ పే, పేటీఎం యూజర్లు.. ఇకపై యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేసుకోవచ్చు..!

ప్రస్తుతం మన దేశంలో వీసా, మాస్టర్ కార్డ్, రూపే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ సంస్థ కార్డు నెట్‌వర్క్ సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థలు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీని ప్రకారం వినియోగదారుడికి ఏ కార్డు జారీ చేయాలన్నది సదరు కార్డు జారీ సంస్థదే నిర్ణయం. ఆర్బీఐ తాజా నిర్ణయం అమల్లోకి వస్తే ఇకపై ఆ విషయంలో వినియోగదారుడిదే అంతిమ నిర్ణయం అవుతుంది. ఉదాహరణకు వీసా కార్డ్ ఉన్నవారు మాస్టర్ కార్డ్, రూపే, మరేదైనా నెట్‌వర్క్‌కు మారాలనుకుంటే ఇకపై మారొచ్చు.

ఆర్బీఐ ముసాయిదాలో ఏముందంటే?
ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన ముసాయిదాలో పలు విషయాలు పేర్కొంది. కార్డ్ జారీచేసే వారు ఆయా సంస్థలతో ముందస్తు ఒప్పందాలు చేసుకొని.. వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌ల సేవలను పొందకుండా నిరోధించకూడదు. అదేవిధంగా కార్డు జారీ చేసే సంస్థ ఒకటి కంటే ఎక్కువ ఫైనాన్షియల్ నెట్‌వర్క్‌లతో సంబంధాలు పెట్టుకోవాలి. వాటికి సంబంధించిన కార్డులు జారీ చేయాలి. అదేవిధంగా.. అర్హులైన కస్టమర్లకు కార్డును ఎంచుకొనే వెసులుబాటును కల్పించాలి. ఎప్పుడైనా పోర్ట్ చేసుకొనే అవకాశం ఉండాలని ఆర్బీఐ పేర్కొంది.

Credit Card UPI Payments : మీకు క్రెడిట్ కార్డు ఉందా? యూపీఐలో రూపే క్రెడిట్ కార్డుతో పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఎలా లింక్ చేయాలంటే?

మీరు మీ కార్డు నెట్‌వర్క్‌ను ఎప్పుడు పోర్ట్ చేయవచ్చు?
డెబిట్, క్రెడిట్ కార్డు నెట్‌వర్క్ పోర్టబిలిటీ ఎంపికను అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చేలా ఆర్బీఐ కసరత్తు చేస్తోంది. అయితే ఆర్బీఐ సర్క్యులర్ లో ఆగస్టు 4వ తేదీ వరకు వివిధ కంపెనీల అభిప్రాయాలను ఆహ్వానిస్తుంది. అన్నీఅనుకున్నట్లు జరిగితే తాజా ఆర్బీఐ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, అక్టోబర్ 1 నాటి ప్రతిపాదిత అమలు తేదీని పరిగణలోకి తీసుకొని, ఈ మార్పులను అమలు చేయడానికి బ్యాంకులకు 90రోజులకంటే తక్కువ సమయం ఉంటుంది. ఇది బ్యాంకులకు అదనపు సమ్మతి, అమలు అవసరాలను కలిగి ఉండవచ్చు.

నెట్‌వర్క్‌ల మధ్య పోటీ పెరుగుతుందా?
ఆర్బీఐ తాజా నిర్ణయం అనుకున్న సమయానికి అమల్లోకి వస్తే.. కార్డు నెట్‌వర్క్‌ల మధ్య పోటీ నెలకొంటుంది. వినూత్న ఆఫర్లు, కస్టమర్లు మెచ్చేలా మెరుగైన పద్దతులు అమలు, ఆకర్షణీయమైన రివార్డ్ ప్రోగ్రాంలను పరిచయంచేసే అవకాశం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు