Realme 12 Series Launch : రియల్‌మి నుంచి రెండు సరికొత్త ఫోన్లు.. భారత్‌లో ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Realme 12 Series 5G Launch : భారత మార్కెట్లో రియల్‌మి నుంచి కొత్త 12 సిరీస్ ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్ల ప్రారంభ ధరలు రూ. 16,999 నుంచి అందుబాటులో ఉంటాయి.

Realme 12 Series 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఆసక్తికరమైన ఫీచర్లతో రియల్‌మి 12 ప్లస్ 5జీ సిరీస్ వచ్చేసింది. బడ్జెట్ విభాగంలో అత్యంత శక్తివంతమైన ఫోన్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ ఒకటి. సోనీ ఎల్‌వైటీ-600 ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌తో పాటు 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వంటి సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్‌లతో వస్తుంది. రియల్‌మి 12 ప్లస్ 5జీతో పాటు, రియల్‌మి చౌకైన రియల్‌మి 12 ఫోన్ కూడా లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్ల ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

Read Also : Kerala AI Teacher Robot : కేరళలో ఏఐ ‘ఐరిస్’ టీచరమ్మ.. విద్యార్థులకు భలేగా పాఠాలు చెబుతుందిగా..!

రియల్‌మి 12 ప్లస్ 5జీ ధర ఎంతంటే? :
రియల్‌మి కొత్త 12 సిరీస్ ఫోన్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అందులో రియల్‌మి 12 ప్లస్, రియల్‌మి 12 అనే రెండు మోడల్‌లు ఉన్నాయి. రియల్‌మి 12 ప్లస్ ధరలు 8జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజ్‌కి రూ. 20,999, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌కి రూ. 21,999గా కంపెనీ నిర్ణయించింది. అదనంగా, ఉచితంగా రియల్‌మి బడ్స్ టీ300ని కూడా సొంతం చేసుకోవచ్చు. రియల్‌మి 12 ఫోన్ మోడల్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ. 16,999, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ. 17,999 నుంచి అందుబాటులో ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే.. ఈ ఫోన్ ధర రూ. 2వేల వరకు ఆదా చేయవచ్చు. మీరు రియల్‌మి 12ని కొనుగోలు చేస్తే.. రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 ఉచితంగా పొందవచ్చు.

రియల్‌మి 12 ప్లస్ 5జీ స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి 12 ప్లస్ 5జీ ఫోన్ 2.6జీహెచ్‌జెడ్ వద్ద ఆర్మ్ కార్టెక్స్-ఎ78 కోర్లు, 2.0జీహెచ్‌జెడ్ వద్ద ఆర్మ్ కార్టెక్స్-ఎ55 కోర్లతో సహా ఆక్టా-కోర్ సీపీయూ కాన్ఫిగరేషన్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5జీ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే.. ఆర్మ్ మాలి-జీ68 జీపీయూని ఉపయోగిస్తుంది. 6ఎన్ఎమ్ ప్రాసెస్ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఈ డివైజ్ 26ఎమ్ఎమ్ ఫోకల్ లెంగ్త్, ఎఫ్/1.8 ఎపర్చర్‌తో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 ప్రైమరీ కెమెరా, 8ఎంపీ వైడ్-యాంగిల్ కెమెరా, 2ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరాతో కూడిన బ్యాక్ కెమెరా సెటప్‌తో వస్తోంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందిస్తుంది. రియల్‌మి 12 ప్లస్ 5జీ ఫోన్ 2400×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది.

రియల్‌మి డిస్‌ప్లే గరిష్టంగా 1200 నిట్‌ల ప్రకాశాన్ని అందిస్తుంది. 5000ఎంఎహెచ్ బ్యాటరీతో ఆధారితంగా పనిచేస్తుంది. 67డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జ్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. ఈ డివైజ్ 162.95ఎమ్ఎమ్ x 7.4సెం.మీ x 7.87ఎమ్ఎమ్ కొలతలలో వస్తుంది. సుమారుగా ఈ హ్యాండ్‌సెట్ 190గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ ఎస్ఏ మోడ్‌లు, ​​2.4/5Gహెచ్‌జెడ్ వై-ఫై, బ్లూటూత్ 5.2కి సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ మొత్తం పయనీర్ గ్రీన్, నావిగేటర్ లైట్ బ్రౌన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. రియల్‌మి ఫోన్ మెమరీ, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో 128జీబీ లేదా 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో 8జీబీ ర్యామ్ అందిస్తుంది. రియల్‌మి 12 ప్లస్ 5జీ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రియల్‌మి యూఐ 5.0పై రన్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు మూడేళ్లు, రెండు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చు.

రియల్‌మి 12 స్పెసిఫికేషన్‌లు :
రియల్‌మి 12 5జీ ఫోన్ 108ఎంపీ 3ఎక్స్ జూమ్ పోర్ట్రెయిట్ కెమెరాతో వస్తుంది. వినియోగదారులు హై-క్వాలిటీ ఫొటోలను క్యాప్చర్ చేసేందుకు అనుమతిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5జీ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ హైకలర్ డిస్‌ప్లే టెక్నాలజీతో కూడిన భారీ 6.72-అంగుళాల ఎఫ్‌హెచ్డీ ప్లస్ సన్‌లైట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 45డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జ్, భారీ 5000ఎంఎహెచ్ బ్యాటరీతో వినియోగదారులు దీర్ఘకాల వినియోగం, ఛార్జింగ్ సామర్థ్యాలను పొందవచ్చు. ఈ డివైజ్‌లో ఇమ్మర్సివ్ ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, సెల్ఫీలను క్యాప్చర్ చేసేందుకు 8ఎంపీ సెల్ఫీ కెమెరా, బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ కోసం డైనమిక్ బటన్ ఉన్నాయి.

రైడింగ్ మోడ్, మినీ క్యాప్సూల్ 2.0 వంటి సెక్యూరిటీ ఫీచర్లతో అదనపు ప్రొటెక్షన్ అందిస్తాయి. బాక్స్ వెలుపల ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రియల్‌మి యూఐ 5.0తో వస్తుంది. ట్విలైట్ పర్పుల్, వుడ్‌ల్యాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. స్టోరేజ్ ఆప్షన్‌లలో 6జీబీ ర్యామ్+ 128జీబీ, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్‌లు ఉన్నాయి. 8జీబీ ర్యామ్ వేరియంట్‌తో రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3, 6జీబీ ర్యామ్ వేరియంట్‌తో కూడిన కూపన్‌ల వంటి అదనపు ఆఫర్లతో కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌లు, నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Nothing Phone 2a : రెడ్‌మి, పోకో ఫోన్లకు పోటీగా నథింగ్ ఫోన్ 2ఎ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు