Nothing Phone 2a : రెడ్‌మి, పోకో ఫోన్లకు పోటీగా నథింగ్ ఫోన్ 2ఎ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Nothing Phone 2a : భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 2ఎ కొత్త మోడల్ లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 23,999 నుంచి అందుబాటులో ఉంటుంది.

Nothing Phone 2a : రెడ్‌మి, పోకో ఫోన్లకు పోటీగా నథింగ్ ఫోన్ 2ఎ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Nothing Phone 2a launched at a starting price of Rs 23,999

Nothing Phone 2a Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నథింగ్ కంపెనీ నుంచి భారత మార్కెట్లోకి మూడో స్మార్ట్‌ఫోన్‌ నథింగ్ ఫోన్ 2ఎ వచ్చేస్తోంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మొత్తం 2 వేరియంట్‌లలో వస్తుంది. దేశ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.23,999 నుంచి అందుబాటులో ఉంటుంది. కంపెనీ భారత్ వేదికగా గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. నథింగ్ ఫోన్ 2ఎ సైన్ పారదర్శక డిజైన్‌తో వస్తుంది. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5తో రన్ అవుతుంది. ఐకానిక్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది.

Read Also : Jio New 5G Smartphone : గుడ్ న్యూస్.. రూ. 10వేల లోపు ధరలో కొత్త జియో 5G స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది!

భారత్‌లో నథింగ్ ఫోన్ 2ఎ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 2ఎ మోడల్ మొత్తం 3 ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 23,999కి అందుబాటులో ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.25,999కు కొనుగోలు చేయొచ్చు. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర రూ.27,999కు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా, రూ.2వేల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. అర్హత గల కస్టమర్లు నథింగ్ ఫోన్ బేస్ మోడల్ ధర రూ. 21,999కు కొనుగోలు చేయొచ్చు. హై వేరియంట్ ధర రూ.25,999కు పొందవచ్చు.

నథింగ్ ఫోన్ 2ఎ స్పెసిఫికేషన్‌లు :
నథింగ్ ఫోన్ మోడల్ గరిష్టంగా 12జీబీ ర్యామ్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. అదనంగా, నథింగ్ ఫోన్‌లో 8జీబీ ర్యామ్ బూస్టర్ ఉంది. మొత్తం ర్యామ్ 20జీబీకి పెంచుతుంది. మూడు ర్యామ్ స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. ఇందులోని రెండు మోడల్‌లు 8జీబీ ర్యామ్‌తో వస్తాయి. 128జీబీ 256జీబీ స్టోరేజీ కోసం ఆప్షన్లు ఉన్నాయి.

అంతేకాదు..టాప్ వేరియంట్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ 2ఎ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఎఫ్/1.88 ఎపర్చరు లెన్స్, 1/1.56-అంగుళాల సెన్సార్ పరిమాణం, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్టుతో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 114-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 50ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంది.

సెల్ఫీల విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ 2ఎ 32ఎంపీ కెమెరాతో వస్తుంది. నథింగ్ ఫోన్ 2ఎ ఫోన్‌లో 6.7-అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, 1300 నిట్‌ల వరకు ఉంటుంది. నథింగ్ ఫోన్ 2ఎ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో సన్నని బెజెల్‌లను కలిగి ఉంది. ఫోన్ స్క్రీన్‌కు నాలుగు వైపులా కేవలం 2.1మిమీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 5,000ఎంఎహెచ్ బ్యాటరీ 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ముఖ్యంగా, నథింగ్ ఫోన్ బాక్స్‌లో ఛార్జింగ్ కేబుల్ అందించలేదు.

Read Also : Infinix Smart 8 Plus Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? సరసమైన ధరకే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?