Realme 14T Launch
Realme 14T Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి నుంచి సరికొత్త రియల్‌మి 14T అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మి 14 ప్రో, రియల్‌మి 14 ప్రో ప్లస్, రియల్‌మి 14 ప్రో లైట్ కన్నా తక్కువ ధరకే అందిస్తోంది.
Read Also : Vivo V30e Price : వివో లవర్స్‌కు పండగే.. ఫాస్ట్ 5G కనెక్టివిటీతో చౌకైన ధరకే కొనేసుకోండి.. డోంట్ మిస్!
ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమోల్డ్ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, డ్యూయల్ కెమెరా సెటప్, భారీ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ దుమ్ము, నీటి నిరోధకతకు IP66+IP668+IP69 రేటింగ్‌లను కూడా కలిగి ఉంది. రియల్‌మి 14T ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
భారత్‌లో రియల్‌మి 14T 5G ధర, ఆఫర్లు :
రియల్‌మి 14T ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999కు అందిస్తోంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.19,999కు అందిస్తోంది. కస్టమర్లు రూ.వెయ్యి బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ లైటనింగ్ పర్పుల్, అబ్సిడియన్ బ్లాక్, సర్ఫ్ గ్రీన్ వంటి వివిధ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్, రిటైల్ ఛానల్ పార్టనర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి 14T 5G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి 14T 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. 2,100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కూడా అందిస్తుంది. హుడ్ కింద, ఫోన్ 8GB వరకు LPDDR4X ర్యామ్, 256GB వరకు స్టోరేజీతో మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ రియల్‌మి ఆండ్రాయిడ్ 15-ఆధారిత రియల్‌మి UI 6పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. రియల్‌మి 14T 50MP ప్రైమరీ షూటర్‌తో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ను అందిస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ రియల్‌మి ఫోన్ 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. లైవ్ ఫొటో సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా ఈ రియల్‌మి 14T ఫోన్ 5G, 4G, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C పోర్ట్‌ను కూడా అందిస్తుంది.