Realme 15 Pro : రియల్‌మి కొత్త సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, లాంచ్ డేట్, స్పెషిఫికేషన్లు లీక్.. ఫుల్ డిటెయిల్స్..!

Realme 15 Pro : భారత మార్కెట్లోకి రియల్‌మి నుంచి సరికొత్త 15 ప్రో సిరీస్ రాబోతుంది. అతి త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Realme 15 Pro

Realme 15 Pro : రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. రియల్‌మి 15 సిరీస్ అతి త్వరలో భారత మార్కెట్లో లాంచ్‌కు రెడీ అవుతోంది. ప్రతి ఏడాది మాదిరిగానే లైనప్‌లో వెనిల్లా ట్రిమ్, ప్రో వేరియంట్ ఉంటాయి. లాంచ్‌కు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. రియల్‌మి 15ప్రో ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పర్ఫార్మెన్స్, డిజైన్, డిస్‌ప్లేతో సహా కీలక వివరాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోన్ మైక్రోసైట్ ఇప్పటికే లైవ్ అయింది. కంపెనీ కొన్ని కీలక వివరాలను ధృవీకరించింది. అయితే, రియల్‌మి 15 ప్రో భారత్ ధరను ఎంతో ముందే ప్రకటించింది. రియల్‌మి 15 ప్రో లాంచ్ తేదీ, ధర, స్పెసిఫికేషన్ల ఇతర వివరాలపై ఓసారి లుక్కేయండి..

రియల్‌మి 15 ప్రో భారత్ లాంచ్ తేదీ :
రియల్‌మి 15 ప్రో జూలై 24న సాయంత్రం 7 గంటలకు రియల్‌మి 15 5Gతో పాటు భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ రియల్‌మి ఫ్లిప్‌కార్ట్, అధికారిక ఈ-స్టోర్, ఇతర రిటైల్ ఛానెల్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది. అయితే, అధికారిక సేల్ డేట్ తేదీ ఇంకా రివీల్ చేయలేదు.

రియల్‌మి 15 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా) :
రియల్‌మి 15 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో రానుందని అంచనా. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌, 7,000mAh బ్యాటరీతో రానుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ రియల్‌మి IP68, IP69 రేటింగ్‌తో రావచ్చు.

Read Also : Oppo Find X8 Pro : అద్భుతమైన ఆఫర్ భయ్యా.. ఒప్పో ఫైండ్ X8 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

కెమెరాల విషయానికొస్తే.. ఈ రియల్‌మి OISతో కూడిన 50MP ప్రైమరీ షూటర్, 50MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ ఈ రియల్‌మి 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండవచ్చు.

రియల్‌మి 15 ప్రో 5G డిజైన్ :
ఈ రియల్‌మి ఫోన్ 7.69mm మందం కలిగి ఉండొచ్చు. ఈ కేటగిరీలో రాబోయే అత్యంత సన్నని ఫోన్ కూడా ఇదే. కెమెరా సెన్సార్లు, ఫ్లాష్‌తో కూడిన స్క్వేరిష్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ కర్వడ్ బెజెల్స్, పంచ్ హోల్ కెమెరా సెటప్‌ కలిగి ఉండొచ్చు.

రియల్‌మి 15 ప్రో 5G ధర (అంచనా) :
లీక్ డేటా ప్రకారం.. రియల్‌మి 15 ప్రో 5G ధర రూ. 39,999 ఉండొచ్చు. రిటైల్ ధర బాక్స్ ధర కన్నా తక్కువగా ఉంటుంది. లీకుల ప్రకారం.. ఈ ఫోన్ ధర రూ. 35,999 ఉండవచ్చు. అధికారిక ధరలు జూలై 24న రివీల్ అయ్యే అవకాశం ఉంది.