Oppo Find X8 Pro : అద్భుతమైన ఆఫర్ భయ్యా.. ఒప్పో ఫైండ్ X8 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Oppo Find X8 Pro : ఒప్పో ఫైండ్ X8 ప్రో ధర తగ్గిందోచ్.. చాలా తక్కువ ధరకే అమెజాన్‌లో కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Oppo Find X8 Pro : అద్భుతమైన ఆఫర్ భయ్యా.. ఒప్పో ఫైండ్ X8 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Oppo Find X8 Pro

Updated On : July 22, 2025 / 4:07 PM IST

Oppo Find X8 Pro : ఒప్పో అభిమానులకు అదిరిపోయే ఆఫర్.. కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. అమెజాన్ ఒప్పో ఫైండ్ X8 ప్రోపై రూ. 18వేల కన్నా ఎక్కువ భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

మీరు తక్కువ ధరకు ప్రీమియం ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్‌ను అసలు వదులుకోవద్దు. ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫోన్ హై-ఎండ్ కెమెరా సిస్టమ్, లాంగ్ బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో రన్ అవుతుంది. ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో ఈ డీల్‌ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Reels Earn Money : మీకు రీల్స్ చేయడం ఇష్టమా? ఈ ప్రభుత్వ కొత్త పథకంతో డబ్బులు సంపాదించవచ్చు.. ఎలా అప్లయ్ చేయాలంటే?

ఒప్పో ఫైండ్ X8 ప్రో అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X8 ప్రో ధర రూ.99,999కు లాంచ్ అయింది. అమెజాన్ ప్రస్తుతం ఈ ప్రీమియం ఫోన్‌పై రూ.87,999 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దాంతో ఒప్పో ఫోన్ ధర రూ.87,999కు తగ్గింది. మీరు ఒప్పో ఫైండ్ X8 ప్రోపై రూ.5,500 అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంతేకాదు.. రూ.1,000 విలువైన కూపన్‌ కూడా ఉంది. మీ పాత హ్యాండ్‌సెట్‌తో ఎక్స్చేంజ్ చేయొచ్చు.

ఒప్పో ఫైండ్ X8 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో ఫైండ్ X8 ప్రో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. డాల్బీ విజన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. ఒప్పో ఫైండ్ X8 ప్రో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP 3X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP సోనీ IMX858 6x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కలిగి ఉంది.

ఈ ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9400 చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. ఇంకా, ఒప్పో ఫైండ్ X8 ప్రో స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5910mAh బ్యాటరీని కలిగి ఉంది.