×
Ad

Realme 16 5G : 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో రియల్‌మి 16 5G వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Realme 16 5G : Realme అతి త్వరలో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 16 5జీ ఈ ఫోన్ రియల్‌మి 15 5జీకి అప్‌గ్రేడ్ అని సమాచారం. కంపెనీ రాబోయే ఫోన్ గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

(Image Credit To Original Source)

  • రియల్‌మి 16 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ ఉండొచ్చు
  • ఈ ఫోన్ 6.57-అంగుళాల 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
  • 60W ఛార్జింగ్‌తో 7,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ రియర్ కెమెరా

Realme 16 5G : కొత్త రియల్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 16 5జీ వచ్చేస్తోంది. రాబోయే ఈ కొత్త ఫోన్ రియల్‌మి 15 5జీకి అప్‌గ్రేడ్ వెర్షన్‌. ప్రస్తుతం, కంపెనీ ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలను ఇంకా రివీల్ చేయలేదు.

అయితే, ఇతర ప్లాట్ ఫారాలు స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను లీక్ చేశాయి. లీక్ ప్రకారం.. రియల్‌మి 16 5జీలో అమోల్డ్ డిస్‌ప్లే, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 7000mAh బ్యాటరీ కూడా ఉండవచ్చు.

రియల్‌మి 16 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా) :
రియల్‌మి 16 5జీ ఫోన్ 6.57-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 45,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ డిస్‌ప్లేలో AGC డీటీ-స్టార్ డీ ప్లస్ షీల్డ్ గ్లాస్ కూడా ఉంటుంది. స్క్రాచ్, డ్రాప్ ప్రొటెక్షన్‌ కూడా అందిస్తుంది. ఈ రియల్‌మి ఫోన్ IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌లతో కూడా వస్తుంది.

వాటర్, డస్ట్ ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6400 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీని కూడా అందిస్తుంది. అదనంగా, హ్యాండ్‌సెట్ స్టోరేజీ కోసం మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్‌ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది.

Realme 16 5G (Image Credit To Original Source)

కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ సిమ్, 5G, 4G LTE, Wi-Fi 5, GPS, NFC, OTG, బ్లూటూత్ 5.3, USB టైప్-సీ ఉన్నాయి. ఈ ఫోన్ 60W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 7,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ బ్లాక్, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుందని భావిస్తున్నారు.

Read Also : Republic Day Sale 2026 : రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు.. కొత్త ఫోన్ కొనే ముందు ఈ 5 విషయాలను తప్పక తెలుసుకోండి.. లేదంటే భారీగా నష్టపోతారు!

కెమెరాల విషయానికొస్తే..

రియల్‌మి 16 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ ప్రైమరీ కెమెరా 50MP, 2MP సెకండరీ కెమెరా లెన్స్ ఉంటుంది. అదనంగా, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 1080p రిజల్యూషన్, సెకనుకు 30 ఫ్రేమ్‌ల వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

లాంచ్ ఎప్పుడంటే? :
రియల్‌మి 16 5జీ లాంచ్‌కు సంబంధించి రియల్‌మి ఇంకా ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే, కంపెనీ గత ఏడాది జూలైలో ప్రపంచ మార్కెట్లో రియల్‌మి 15 5Gని ప్రవేశపెట్టింది. కంపెనీ ఇప్పటికే భారత మార్కెట్లో రియల్‌మి 16 ప్రో, రియల్‌మి 16 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. రియల్‌మి 16 5G స్టాండర్డ్ వేరియంట్ కూడా త్వరలోనే లాంచ్ కానుంది.