Realme C67 5G Launch : రూ.15వేల లోపు ధరలో రియల్‌మి C67 5జీ బడ్జెట్ ఫోన్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

Realme C67 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే, మరికొద్దిరోజులు ఆగండి.. రూ. 15వేల లోపు ధరలో రియల్‌మి C67 5జీ బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది. పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Realme C67 5G Launch : భారత మార్కెట్లోకి రియల్‌మి కొత్త 5జీ బడ్జెట్ ఫోన్ వస్తోంది. ఈ నెలలో కొత్త రియల్‌మి C67 బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ధృవీకరించింది. షెడ్యూల్ ప్రకారం.. డిసెంబరు 14న భారతీయ మార్కెట్లో రియల్‌మి సి67 5జీ ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్ వర్చువల్‌గా మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. రియల్‌మి మునుపటి సి-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను పరిశీలిస్తే.. రాబోయే కొత్త రియల్‌మి సి67 ధర రూ. 11వేల నుంచి రూ. 15వేల మధ్య ఉండవచ్చు.

రియల్‌మి సి67 డిజైన్ :
ప్రస్తుతం రియల్‌మి వెబ్‌సైట్‌లోని మైక్రోసైట్‌లో రియల్‌మి సి67 ఫోన్ లిస్టు అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ట్విట్టర్ (X)లో కూడా టీజ్ చేసింది. రియల్‌మి నార్జో 60ఎక్స్ మాదిరిగానే స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ రౌండ్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుందని టీజర్‌లు వెల్లడిస్తున్నాయి. ఈ డివైజ్ లెఫ్ట్ టాప్ కార్నర్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ కూడా ఉంది.

Read Also : Tata Car Discounts 2023 : ఈ డిసెంబర్‌లో టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. సఫారి టు టిగోర్‌ వేరియంట్లపై రూ. 1.40 లక్షల వరకు తగ్గింపు!

టీజ్ చేసిన ఫొటో ప్రకారం. కొంత గ్రేడియంట్ ఆకృతితో లైమ్ గ్రీన్ వేరియంట్‌ను కలిగి ఉంది. చాలా ఆండ్రాయిడ్ డివైజ్‌లలో మాదిరిగా రియల్‌మి సి67 5జీ కూడా పవర్ బటన్, రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్, లెఫ్ట్ సైడ్ పవర్ బటన్‌ను కలిగి ఉంటుంది. టీజర్‌లను బట్టి చూస్తే.. స్మార్ట్‌ఫోన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బరువు కూడా చాలా తేలికగా ఉంటుందని అంచనా.

రియల్‌మి సి67 ధర :
గత జనరేషన్ రియల్‌మి సి-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను పరిశీలిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 11వేల నుంచి రూ. 15వేల మధ్య ఉండవచ్చు. అదనంగా, రియల్‌మి సి67 డిజైన్ రియల్‌మి నార్జో 60ఎక్స్ మోడల్ మాదిరిగా ఉంటుంది. వాస్తవానికి రెండు డివైజ్‌ల ధర కూడా ఒకే విధంగా ఉండవచ్చు. రియల్‌మి నార్జో 60ఎక్స్ ఫోన్ భారత మార్కెట్లో రూ. 12,999 నుంచి అందుబాటులో ఉంది.

Realme C67 5G launch in India  

రియల్‌మి సి67 స్పెసిఫికేషన్స్ :
రియల్‌మి స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను అధికారికంగా ఇంకా ధృవీకరించనప్పటికీ, ఫ్రంట్ సైడ్ కొన్ని వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. రియల్‌మి సి67 680నిట్స్ గరిష్ట ప్రకాశంతో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ పేర్కొన్నారు. ఈ డివైజ్ స్పష్టంగా 200గ్రాముల కన్నా తక్కువ బరువు ఉంటుంది. 7.89ఎమ్ఎమ్ మందంగా ఉంటుంది. ఈ డివైజ్ పవర్ 6ఎన్ఎమ్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీగా చెబుతోంది.

ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే రియల్‌మి యూఐ4.0ని రన్ చేయనుందని భావిస్తున్నారు. నార్జో 60ఎక్స్ తేడాలను పరిశీలిస్తే.. 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉండవచ్చు. 33డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని కూడా భావిస్తున్నారు. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. రియల్‌మి సి67 సిరీస్ డ్యూయల్ కెమెరా సెన్సార్‌లో 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా సెల్ఫీలకు 8ఎంపీ కెమెరాను కలిగి ఉండవచ్చు.

Read Also : boAt Lunar Pro LTE : జియో ఇ-సిమ్ సపోర్టుతో బోట్ లూనార్ ప్రో ఎల్టీఈ స్మార్ట్‌వాచ్ వస్తోంది.. మీ దగ్గర ఫోన్ లేకున్నా కాల్స్ చేయొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు