Realme C71 5G : రివర్స్ ఛార్జింగ్‌తో కొత్త రియల్‌మి 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర కూడా చాలా తక్కువే..!

Realme C71 5G : రియల్‌మి కొత్త 5G ఫోన్ లాంచ్ అయింది. రివర్స్ ఛార్జింగ్ సపోర్టు అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ధర ఎంతంటే?

Realme C71 5G

Realme C71 5G : రియల్‌మి నుంచి సరికొత్త C71 5G ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ 6,300mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ అయింది. 13MP రియర్ కెమెరాతో పాటు 5MP సెల్ఫీ షూటర్‌తో AI-ఆధారిత ఇమేజింగ్, ఎడిటింగ్ టూల్స్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6GB వరకు ర్యామ్, 12nm ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 చిప్‌సెట్‌ను పొందుతుంది. మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ బిల్డ్, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది.

ధర, లభ్యత :
దేశంలో రియల్‌మి C71 5G ఫోన్ 4GB + 64GB ఆప్షన్‌ ధర రూ. 7,699 నుంచి ప్రారంభమవుతుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ. 8,699కు లభిస్తుంది. అబ్సిడియన్ బ్లాక్, సీ బ్లూ కలర్ ఆప్షన్లలో అమ్మకానికి ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఇండియా ఇ-స్టోర్ వంటి ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి C71 5G ఫోన్ 6.74-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్స్) డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 563 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవల్‌ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా-కోర్ 12nm యూనిసోక్ T7250 SoC ద్వారా 6GB వరకు ర్యామ్, 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత రియల్‌మి యూఐ6తో వస్తుంది.

Read Also : Airtel Cheapest Plan : ఎయిర్‌టెల్ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. 60 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు డేటా ఎంతంటే?

ఆప్టిక్స్ విషయానికొస్తే.. రియల్‌‌మి C71 5G బ్యాక్ సైడ్ ఆటోఫోకస్ సపోర్ట్, f/2.2 ఎపర్చర్‌తో 13MP ఓమ్నివిజన్ OV13B సెన్సార్‌ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ 5MP సెన్సార్‌ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ HD వీడియో రికార్డింగ్, ఏఐ ఎరేజర్, ఏఐ క్లియర్ ఫేస్, ప్రో మోడ్, డ్యూయల్-వ్యూ వీడియో వంటి ఇతర ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. బ్యాక్ సైడ్ వృత్తాకార పల్స్ లైట్ యూనిట్‌ను 9 కలర్లు, 5 గ్లోయింగ్ మోడ్‌లలో కస్టమైజ్ చేసుకోవచ్చు.

రియల్‌మి C71 5G ఫోన్ 15W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 6W వైర్డు రివర్స్ ఛార్జింగ్‌తో 6,300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

సెక్యూరిటీ విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ-గ్రేడ్ MIL-STD-810H షాక్-రెసిస్టెంట్, IP54-రేటెడ్ డస్ట్, వాటర్-రెసిస్టెంట్ బిల్డ్‌ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ సైజులో 167.20×76.60×7.94mm, బరువు 201 గ్రాములు ఉంటుంది.