Realme C75 5G : రియల్‌మి C75 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు..!

Realme C75 5G : రియల్‌మి C75 5G ఫోన్ రూ. 12,999 ప్రారంభ ధరకు వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ రియర్ కెమెరాలు, IP64 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లతో వస్తుంది.

Realme C75 5G

Realme C75 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? రియల్‌మి ఇండియా అధికారికంగా రియల్‌మి C75 5G ప్రవేశపెట్టింది. బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ కేటగిరీ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.

4GB ర్యామ్, 128GB స్టోరేజ్ కలిగిన ఈ రియల్‌మి ఫోన్ ధర రూ. 12,999కు లభిస్తుంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ధర రూ. 13,999కు పొందవచ్చు.

Read Also : Nothing Phone (2a) 5G : అమెజాన్‌లో నథింగ్ ఫోన్ (2a) ధర తగ్గిందోచ్.. సరసమైన ధరకే ఇలా కొనేసుకోండి..!

ఈ రెండు వేరియంట్లు ఫ్లిప్‌కార్ట్, అధికారిక రియల్‌మి వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

రియల్‌మి C75 5G ముఖ్య ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
రియల్‌మి C75 5G ఫోన్ 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. రియల్‌మి వ్యూ ఎక్స్‌పీరియన్స్ గేమింగ్ 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ రియల్‌మి యూఐ 6తో ఆండ్రాయిడ్ 15 OSలో రన్ అవుతుంది. 12GB డైనమిక్ ర్యామ్ (6GB ఫిజికల్ + 6GB వర్చువల్) వరకు సపోర్టు ఇస్తుంది.

128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. అన్‌లాకింగ్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ ఏఐ సపోర్టు గల కెమెరా సిస్టమ్‌తో 32MP ప్రైమరీ రియర్ సెన్సార్‌ను కలిగి ఉంది. 8MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ ఇంటర్నల్ ఏఐ ఎడిటింగ్ టూల్స్‌తో వస్తుంది.

స్పెషల్ ఫీచర్లలో 6,000mAh బ్యాటరీ, 45W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ డస్ట్, స్ప్లాష్ నిరోధకతకు IP64 రేటింగ్, MIL-STD 810H వెరిఫైడ్ కలిగి ఉందని పేర్కొంది.

కనెక్టివిటీ ఆప్షన్లలో 5G,డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, USB టైప్-C, గ్లోనాస్ గెలీలియోతో సహా మల్టీ జీపీఎస్ సిస్టమ్స్ ఉన్నాయి.

లిల్లీ వైట్, మిడ్‌నైట్ లిల్లీ, పర్పుల్ బ్లోసమ్ వంటి స్టైలిష్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ రియల్‌మి బరువు దాదాపు 190 గ్రాములు, మందం కేవలం 7.94 మిమీ ఉంటుంది.

Read Also : Marwari Family : కేజీ బంగారం, 4 సూట్ కేసుల నిండా క్యాష్, 131 ఎకరాల భూమి, ఒక పెట్రోల్ పంప్.. మార్వాడీ పెళ్లిలో ‘కట్నం’ చూశారా..?!

హార్డ్‌వేర్, ఆండ్రాయిడ్ 15, స్ట్రాంగ్ బ్యాటరీ లైఫ్‌తో రియల్‌మి C75 5G భారతీయ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు రూ. 15వేల లోపు ఆకర్షణీయమైన కొనుగోలుగా నిలిచింది.