Nothing Phone (2a) 5G : అమెజాన్‌లో నథింగ్ ఫోన్ (2a) ధర తగ్గిందోచ్.. సరసమైన ధరకే ఇలా కొనేసుకోండి..!
Nothing Phone (2a) 5G : అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2a సరసమైన ధరకే లభిస్తోంది. ఏకంగా రూ. 6,500 ధర తగ్గింది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Nothing Phone 2a 5G
Nothing Phone (2a) 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో నథింగ్ ఫోన్ (2a) 5G ఫోన్ ధర రూ.8,500 కన్నా భారీ తగ్గింపును పొందింది. రూ.17,500 కన్నా తక్కువ ధరకు అమ్ముడవుతోంది.
Read Also : Jio Unlimited Offer : పండగ చేస్కోండి.. జియో అన్‌లిమిటెడ్ ఆఫర్ పొడిగింపు.. IPL ఫైనల్ వరకు ఎంజాయ్ చేయొచ్చు!
ప్రత్యేకమైన డిజైన్, క్లీన్ సాఫ్ట్‌వేర్, కెమెరాలు, మంచి బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్-రేంజ్ విభాగంలో బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అమెజాన్ డిస్కౌంట్‌తో మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
కాల్స్, మెసేజ్‌ల కోసం గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌తో ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను కలిగి ఉంది. నథింగ్ ఫోన్ 2a కొనాలని చూస్తుంటే.. డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.
నథింగ్ ఫోన్ (2a) ధర తగ్గింపు :
అమెజాన్‌లో నథింగ్ ఫోన్ (2a) ఫోన్ ధర రూ.5,342 తగ్గింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.23,999 ఉండగా, ప్రస్తుతం కేవలం రూ.18,657కే అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు HDFC క్రెడిట్ కార్డులపై రూ.1,250 బ్యాంక్ డిస్కౌంట్ వరకు ఎక్కువ ఆదా చేసుకోవచ్చు.
అమెజాన్ నెలకు ధర రూ.17,407కి తగ్గుతుంది. రూ.905 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందిస్తోంది. ఈ డిస్కౌంట్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌పై మాత్రమే అందుబాటులో ఉంది.
నథింగ్ ఫోన్ (2a) స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ (2a) ఫోన్ 6.7-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7200 ప్రో చిప్‌సెట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వరకు అందిస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ (2a) 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం.. ఈ హ్యాండ్‌సెట్‌లో 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత నథింగ్ OS 2.5పై రన్ అవుతుంది.