PM Kisan : బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 20వ విడత వచ్చేది అప్పుడే.. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో చెక్ చేసుకోండి
PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు త్వరలో విడుదల కానున్నాయి. ఈ లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఓసారి చెక్ చేయండి.

PM Kisan 20th installment
PM Kisan Yojana 20th installment : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడతను త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటివరకు, నమోదిత రైతుల కోసం పీఎం కిసాన్ యోజన 19 విడతలు విడుదల అయ్యాయి.
ఇప్పుడు రైతులు రాబోయే 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద భూమి కలిగిన అన్ని రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6వేలు మూడు సమాన వాయిదాలలో అందిస్తారు.
ఈ పీఎం కిసాన్ పథకం డిసెంబర్ 1, 2018 నుంచి అమలులోకి వచ్చింది. ప్రభుత్వం అందరు లబ్ధిదారులు eKYC పూర్తిచేసేందుకు తప్పనిసరి చేసిందని గమనించాలి. పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు eKYC తప్పనిసరిగా గమనించాలి.
OTP ఆధారిత eKYC పీఎం కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని CSC కేంద్రాలను సంప్రదించవచ్చు” అని పథకం అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.
ఇప్పటివరకు, నమోదైన రైతుల కోసం పీఎం కిసాన్ యోజన 19 వాయిదాలు విడుదల అయ్యాయి. ఫిబ్రవరి 24, 2025న రైతుల ఖాతాలకు చివరి విడత రూ. 2వేలు నేరుగా బదిలీ అవుతుంది.
ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారుల జాబితా అనేది ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు అర్హులైన రైతులకు అందిస్తోంది. ఈ జాబితాలో పేరును చెక్ చేసేందుకు లబ్ధిదారులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ కింది విధంగా తెలుసుకోవచ్చు.
- పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in) విజిట్ చేయండి.
- హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న ‘Farmer Corner’ఆప్షన్ కనుగొనండి.
- రైతు కార్నర్ విభాగంలో లబ్ధిదారుల జాబితా ఆప్షన్ క్లిక్ చేయండి.
- డ్రాప్-డౌన్‌లో రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి.
- ‘Get Report’పై క్లిక్ చేయండి.
- లబ్ధిదారుల పూర్తి లిస్ట్ కనిపిస్తుంది.
- మీ పేరును చెక్ చేయవచ్చు.
Read Also : Jio Unlimited Offer : పండగ చేస్కోండి.. జియో అన్‌లిమిటెడ్ ఆఫర్ పొడిగింపు.. IPL ఫైనల్ వరకు ఎంజాయ్ చేయొచ్చు!
ఏదైనా సాయం కోసం లబ్ధిదారులు PM-Kisan హెల్ప్‌లైన్ నంబర్ -1555261, 1800115526 లేదా 011-23381092 సంప్రదించవచ్చు. అంతేకాకుండా, పీఎం కిసాన్ యోజన అధికారిక ఇమెయిల్ చిరునామా pmkisan-ict@gov.in ద్వారా కూడా సంప్రదించవచ్చు.