Realme GT 7 Pro launching in India
Realme GT 7 Pro Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి రియల్‌మి జీటీ 7 ప్రో చైనాలో ఇటీవల లాంచ్ అయింది. ఆ తర్వాత నవంబర్ 26న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ ఎలైట్ ప్రాసెసర్‌ను కలిగిన మొదటి ఫోన్‌గా చెప్పవచ్చు. భారీ 6500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.
చైనాలో రియల్‌మి జీటీ 7ప్రో 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర సీఎన్‌వై 3,699 (సుమారు రూ. 43,800) నుంచి ప్రారంభమవుతుంది. ఇతర వెర్షన్‌లు ఎక్కువ ర్యామ్, స్టోరేజ్‌ను అందిస్తాయి. టాప్-టైర్ 16జీబీ + 1టీబీ వేరియంట్ ధర సీఎన్‌వై 4,799 (సుమారు రూ. 56,900). మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ ఎడిషన్, స్టార్ ట్రైల్ టైటానియం, లైట్ డొమైన్ వైట్‌లో అందుబాటులో ఉంది.
రియల్‌మి జీటీ 7ప్రో 6.78-అంగుళాల ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10+, డాల్బీ విజన్ 6,000 నిట్‌ల వరకు ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ గ్లాస్ ఫ్రంట్, అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది. ఐపీ68/ఐపీ69-రేటెడ్, 30 నిమిషాల పాటు 2 మీటర్ల వరకు డస్ట్‌ప్రూఫ్, వాటర్‌ప్రూఫ్ కలిగి ఉంది. ఈ డివైజ్ బరువు 222.8 గ్రాములు ఉంటుంది.
రియల్‌మి యూఐ 6.0తో ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతున్న ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్చిప్, అడ్రినో 830 జీపీయూ ద్వారా అందిస్తుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం ఆకర్షణీయమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. గరిష్టంగా 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజీతో అందుబాటులో ఉంటుంది. ఈ డేటా కోసం స్పీడ్, తగినంత స్టోరేజీని అందిస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. రియల్‌మి జీటీ 7 ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరా 16ఎంపీతో పాటు 24ఎఫ్‌పీఎస్, 4కె రికార్డింగ్ వద్ద 8కె వీడియోకు సపోర్టు ఇస్తుంది.
హెడ్‌ఫోన్ జాక్ లేనప్పటికీ, ఆడియో స్టీరియో స్పీకర్‌లతో వస్తుంది. వై-ఫై 6/7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీకి సపోర్టు ఇస్తుంది. ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది. 6500mAh బ్యాటరీ 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో త్వరగా ఛార్జ్ అవుతుంది.
రియల్‌మి జీటీ 7 ప్రో పవర్, స్టైల్ అత్యాధునిక ఫీచర్లను అందిస్తుంది. అద్భుతమైన డిజైన్‌లో హై పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.