Realme GT 7 Pro (Image Credit to Original Source)
Realme GT 7 Pro : రియల్‌మి లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. 2026 కొత్త ఏడాదికి ముందే అమెజాన్‌లో భారీ ధర తగ్గింపుతో రియల్‌మి జీటీ 7 ప్రో లభిస్తోంది. అత్యంత సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ రియల్‌మి మొదట్లో రూ. 59,999గా ఉండేది. అయితే, ప్రస్తుతం రూ. 50వేల లోపు ధరకే అందుబాటులో ఉంది. రియల్‌మి జీటీ 7 ప్రో 6.78-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
6,500 నిట్స్ టాప్ బ్రైట్ నెస్, ఫ్లాగ్‌షిప్ పర్ఫార్మెన్స్, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంది. అధిక ధరలకు గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే జీటీ 7 ప్రో ఇప్పుడు అద్భుతమైన డీల్ కావచ్చు.
ప్రస్తుతం అమెజాన్‌లో రియల్‌మి జీటీ 7 ప్రో రూ. 10వేల ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత రూ. 49,999కు లభిస్తుంది. అదనంగా, కొనుగోలుదారులు డీబీఎస్ బ్యాంక్, స్కాపియా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ. 1,500 తగ్గింపును పొందవచ్చు.
మీ పాత స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే అమెజాన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కూడా పొందవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్ వర్కింగ్ కండిషన్ బట్టి గరిష్టంగా రూ. 44,300 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తోంది.
Realme GT 7 Pro (Image Credit to Original Source)
రియల్‌మి GT 7 ప్రో 6.78-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ రియల్‌మి డాల్బీ విజన్‌తో కూడా వస్తుంది. 6,500 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్ కూడా కలిగి ఉంది. హుడ్ కింద, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. ఈ రియల్‌మి ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ షూటర్ ఉంది. ఇంకా, ఈ రియల్‌మి 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీని అందిస్తుంది.