Realme GT 7 Pro Launch : రియల్‌మి కొత్త ఫోన్ చూశారా? ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర, ఫీచర్లు వివరాలివే!

Realme GT 7 Pro Launch : భారత మార్కెట్లో రియల్‌మి జీటీ 7ప్రో 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ. 59,999 ఉంటే, హై స్టోరేజీ 16జీబీ+ 512జీబీ ఆప్షన్ ధర రూ. 65,999కు పొందవచ్చు.

Realme GT 7 Pro Launch

Realme GT 7 Pro Launch : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో రియల్‌మి ఎట్టకేలకు కొత్త రియల్‌మి జీటీ 7 (Realme GT 7) ప్రోని లాంచ్ చేసింది. 2022లో లాంచ్ చేసిన రియల్‌మి జీటీ 2 ప్రోకు అప్‌గ్రేడ్ ఆప్షన్లతో వచ్చింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఈ కొత్త మోడల్ రిలీజ్ చేసింది. రియల్‌మి జీటీ 7 ప్రో గత మోడల్‌ల కన్నా చాలా అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. కానీ, కొత్త హార్డ్‌వేర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫోన్ ధర కూడా గత మోడళ్ల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది.

భారత్‌లో రియల్‌మి జీటీ 7ప్రో ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో రియల్‌మి జీటీ 7ప్రో 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ. 59,999కు, హై స్టోరేజీ 16జీబీ+ 512జీబీ ఆప్షన్ ధర రూ. 65,999కు పొందవచ్చు. లభ్యత విషయానికొస్తే.. హ్యాండ్‌సెట్ నవంబర్ 29 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. జీటీ 7 ప్రో మార్స్ ఆరెంజ్, గెలాక్సీ గ్రే అనే 2 ఎండ్ ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి జీటీ 7 ప్రో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
రియల్‌మి జీటీ 7ప్రో ఫుల్-హెచ్‌డీ+ రిజల్యూషన్ గరిష్టంగా 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను అందించే 6.78-అంగుళాల ఎల్‌టీపీఓ అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. డిస్ప్లే క్వాడ్-కర్వ్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+ కంటెంట్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. ఈ ఫోన్ బాడీ ఏజీ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో అల్యూమినియంతో తయారైంది. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ69 రేటింగ్‌ను అందిస్తుంది. 222 గ్రాముల బరువు ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీని పొందిన మొదటి ఫోన్ రియల్‌మి జీటీ 7 ప్రో ఉన్నాయి. గరిష్టంగా 16జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో వస్తుంది. చిప్‌సెట్ 3ఎన్ఎమ్ ఫాబ్రికేషన్, ప్రస్తుత స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీ కన్నా అనేక పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

ప్రీమియం ఫీచర్లతో పాటు అల్ట్రా-ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. ఫోన్ పర్ఫార్మెన్స్-ఆధారిత డివైజ్‌లో ఆసక్తికరమైన కెమెరా సెటప్ కూడా ఉంది. ఫోన్ సోనీ IMX906 50ఎంపీ ప్రైమరీ కెమెరా, సోనీ IMX882 50ఎంపీ టెలిఫోటో కెమెరా, సోనీ IMX355 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరాను అందిస్తుంది. సెల్ఫీలు 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా ఫొటోలు తీయొచ్చు.

రియల్‌మి జీటీ 7ప్రో ఆండ్రాయిడ్ 15పై ఆధారపడిన రియల్‌మి యూఐ 6.0ని రన్ చేస్తుంది. తయారీదారు 3 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తున్నట్లు పేర్కొంది. చైనా మోడల్ 6,500mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, రియల్‌మి 5,800mAh బ్యాటరీతో ఇండియా మోడల్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ చైనా వేరియంట్ మాదిరిగానే 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. రియల్‌మి జీటీ 7 ప్రో కేవలం 30 నిమిషాల్లో 1 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుందని రియల్‌మి పేర్కొంది.

Read Also : iPhone Siri : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై సిరిని కాల్స్, మెసేజ్ చేయమని అడగొచ్చు..!