×
Ad

Realme GT 8 Pro : కొత్త రియల్‌మి జీటీ 8 ప్రో వస్తోందోచ్.. భారత్‌లో లాంచ్ డేట్, స్పెషిఫికేషన్లు వివరాలివే.. ధర ఎంత ఉండొచ్చంటే?

Realme GT 8 Pro : రియల్‌మి జీటీ 8 ప్రో అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. లాంచ్ డేట్, కీలక ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Realme GT 8 Pro

Realme GT 8 Pro : రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది.. టెక్ దిగ్గజం రియల్‌మి GT 8 సిరీస్‌ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. రియల్‌మి GT 8, రియల్‌మి GT 8 ప్రోతో సహా ఈ లైనప్ ఇప్పుడు భారత మార్కెట్లో లాంచ్‌కు రెడీ అవుతోంది. వచ్చే నెల లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

రికో జీఆర్ ఇమేజింగ్ టెక్నాలజీతో మొదటి (Realme GT 8 Pro) రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌గా రిలీజ్ కానుంది. ఇమేజ్ క్లారిటీ, టోన్ సహా అన్ని ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. డిజైన్, స్పెషిఫికేషన్ల నుంచి ధర అంచనాలు, ఇండియా లాంచ్ టైమ్‌లైన్ వరకు రాబోయే రియల్‌మి GT 8 ప్రో గురించి మరిన్న వివరాలపై ఓసారి లుక్కేయండి.

రియల్‌మి జీటీ 8 ప్రో డిజైన్ :
రియల్‌మి జీటీ 8 ప్రో కెమెరా మాడ్యూల్ వైపు రెండు (Torx) స్క్రూ కలిగి ఉంది. కెమెరా హౌసింగ్ డిజైన్‌ కలిగి ఉంటుంది. వినియోగదారులు కస్టమైజడ్ టచ్ కోసం కెమెరా మాడ్యూల్ ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. జీటీ 8 ప్రో కస్టమైజడ్ డిజైన్ ఫీచర్‌‌తో ఫస్ట్ రియల్‌మి ఫోన్‌గా నిలిచింది. ఈ స్మార్ట్‌ఫోన్ వైట్, గ్రీన్, బ్లూ అనే 3 కలర్ ఆప్షన్లలో రానుందని భావిస్తున్నారు.

Read Also : Apple iPhone 16 Plus : ఇది కదా డిస్కౌంట్.. ఐఫోన్ 16 ప్లస్ అతి చౌకైన ధరకే.. ఇప్పుడే కొనేసుకోండి!

రియల్‌మి జీటీ 8 ప్రో స్పెసిఫికేషన్లు :
రియల్‌మి జీటీ 8 ప్రో ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79-అంగుళాల QHD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. ఈ ప్యానెల్ వంద శాతం డీసీఐ-పీ3, sRGB కలర్ గామట్‌కు సపోర్టు ఇస్తుంది. 7,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. హుడ్ కింద క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB UFS స్టోరేజ్‌తో వస్తుంది. బ్యాటరీ ఫ్రంట్ సైడ్ రియల్‌మి జీటీ 8 ప్రో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీని అందిస్తుంది.

రియల్‌మి జీటీ 8 ప్రో కెమెరా ఫీచర్లు :

రియల్‌మి జీటీ 8 ప్రో రికో-ఇంజనీరింగ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 50MP జీఆర్ యాంటీ-గ్లేర్ ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 22mm ఫోకల్ లెంగ్త్ ఉన్నాయి. మెయిన్ సెన్సార్‌తో 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 120x డిజిటల్ జూమ్‌తో భారీ 200MP టెలిఫోటో లెన్స్ అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరా పోర్ట్రెయిట్‌లు, వీడియో కాల్స్ అందిస్తుంది. రికో జీఆర్ ఇమేజింగ్ టెక్నాలజీతో వస్తుంది.

భారత్‌లో రియల్‌మి జీటీ 8 ప్రో లాంచ్ తేదీ, ధర (అంచనా) :
భారత మార్కెట్లో కచ్చితమైన లాంచ్ తేదీని రియల్‌మి ఇంకా ధృవీకరించలేదు. నవంబర్ 10, నవంబర్ 12 మధ్య ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. ముందుగా భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రియల్‌మి జీటీ 8 ప్రో ధర దాదాపు రూ.65వేల నుంచి ఉంటుందని అంచనా.