Apple iPhone 16 Plus : ఇది కదా డిస్కౌంట్.. ఐఫోన్ 16 ప్లస్ అతి చౌకైన ధరకే.. ఇప్పుడే కొనేసుకోండి!

Apple iPhone 16 Plus : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16 ప్లస్ భారీగా తగ్గింది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే? ఇప్పుడే కొనేసుకోండి.

1/5Apple iPhone 16 Plus
Apple iPhone 16 Plus : మీరు కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్ అధికారిక వెబ్‌సైట్‌లో డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ధర రూ.25,500 కన్నా ఎక్కువ తగ్గింపు అందిస్తోంది.
2/5Apple iPhone 16 Plus
అందుకే ఈ డీల్ అసలు వదులుకోవద్దు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీరు ఐఫోన్ 16 ప్లస్‌ ధర మళ్లీ పెరగకముందే కొనేసుకోవడం బెటర్. ఇంతకీ ఈ ఐఫోన్ 16 ప్లస్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/5Apple iPhone 16 Plus
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ డీల్ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ.89,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. రిలయన్స్ డిజిటల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.67,990కి లిస్ట్ అయింది. రిటైలర్ ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.21,910 ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది. అంతేకాదు.. మీరు ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు.
4/5Apple iPhone 16 Plus
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ మోడల్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. హుడ్ కింద ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఆపిల్ A18 చిప్‌సెట్‌తో అమర్చి ఉంటుంది. అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. ఇంకా, ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్‌ కలిగి ఉంటుంది.
5/5Apple iPhone 16 Plus
ఆపిల్ ప్రకారం.. ఐఫోన్ 16 ప్లస్ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. ఐఫోన్ 16 ప్లస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా కలిగి ఉంది.