Realme Narzo 80 Lite 5G : కొత్త ఫోన్ కావాలా? రియల్‌మి నార్జో 80 లైట్ 5G వచ్చేసింది.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

Realme Narzo 80 Lite 5G : రియల్‌మి నార్జో 80 లైట్ 5G వెర్షన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ఈ నెల 23 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది.

Realme Narzo 80 Lite 5G

Realme Narzo 80 Lite 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేసింది. భారత (Realme Narzo 80 Lite 5G) మార్కెట్లో రియల్‌మి నార్జో 80 లైట్ 5G ఫోన్ లాంచ్ అయింది.

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పాటు 6GB వరకు ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. 32MP మెయిన్ కెమెరాతో MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ పొందింది.

Read Also : Google Pixel 9 Pro XL : ఇది కదా సూపర్ డీల్.. ఈ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్‌పై ఏకంగా రూ. 30వేలు తగ్గింపు.. డోంట్ మిస్..!

రియల్‌మి నార్జో 80 లైట్ ఫోన్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇప్పటికే, రియల్‌మి నార్జో 80x, నార్జో 80 ప్రో వేరియంట్లలో లాంచ్ అయింది. తాజాగా లైట్ వెర్షన్ కూడా మార్కెట్లోకి వచ్చింది.

రియల్‌మి నార్జో 80 ఎలైట్ 5G ధర :
భారత మార్కెట్లో రియల్‌మి నార్జో 80 లైట్ 5G ఫోన్ 4GB + 128GB, 6GB + 128GB ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లు వరుసగా రూ. 10,499, రూ. 11,499గా కంపెనీ నిర్ణయించింది.

వినియోగదారులు ఈ వేరియంట్‌లపై రూ. 700 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. క్రిస్టల్ పర్పుల్, ఒనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ జూన్ 23 నుంచి అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి నార్జో 80 లైట్ 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
రియల్‌మి నార్జో 80 లైట్ 5G (Realme Narzo 80 Lite 5G) డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవల్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో వస్తుంది.

6GB వరకు ర్యామ్, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత రియల్‌మి యూఐ 6.0 స్కిన్‌తో వస్తుంది. గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్‌ను కూడా అందిస్తుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. రియల్‌మి నార్జో 80 లైట్ 5G రెక్టాంగ్యులర్ బ్యాక్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. ఆటోఫోకస్ సపోర్ట్‌తో 32MP GC32E2 ప్రైమరీ సెన్సార్ ఉంటుంది.

కెమెరా సెటప్‌లో పిల్-ఆకారపు LED ఫ్లాష్ యూనిట్ ఉంటుంది. రియల్‌మి ఫోన్‌లో ఏఐ-ఆధారిత ఇమేజింగ్, ఏఐ క్లియర్ ఫేస్ వంటి ఏఐ-బ్యాక్డ్ ఇమేజింగ్, ఎడిటింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Read Also : Vivo Y400 Pro 5G : కొత్త వివో ఫోన్ భలే ఉందిగా.. ఈ నెల 20నే లాంచ్.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?

రియల్‌మి నార్జో 80 లైట్ 5G ఫోన్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 15W వైర్డ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ 5G సిమ్ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. IP64 రేటింగ్ కలిగి ఉంది. మిలిటరీ-గ్రేడ్ MIL-STD-810H షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 7.94mm మందం, 197 గ్రాముల బరువు ఉంటుంది.